
మనం రోజూ వండుకునే కాయ కూరగాయల్లో కాలిఫ్లవర్ కూడా ఒకటి. దీనిని కొంతమంది గోబీ అంటారు. ఇంకా దీనితో కర్రీ, పచ్చడి, ఫ్రై, పకోడి లాంటి వైరైటీలు చేసుకుని తింటాము.

అయితే, కాలిఫ్లవర్ తో ఏం చేసుకుని చాలా బావుంటుంది. అంతేకాదు, కాలిఫ్లవర్ మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. అయితే కాలిఫ్లవర్ కుక్ చేసేటప్పుడు ఈ తప్పులు చేయొద్దని నిపుణులు చెబుతున్నారు. ఎందుకో ఇక్కడ తెలుసుకుందాం..

ముందుగా కాలిఫ్లవర్ ను తీసుకుని పాన్ లో వేసేస్తారు. ఇలా చెయ్యకూడదు. దీని వలన రుచి మొత్తం పోతుంది. అలా కాకుండా, కాలిఫ్లవర్ ను తీసుకుని శుభ్ర పరిచి ఆరబెట్టి ఆ తర్వాత వండాలి.

ఇక కొందరు మధ్యలోనే ఉప్పు వేస్తుంటారు. అయితే, ఇది అంత మంచి పద్ధతి కాదని అంటున్నారు. కూర త్వరగా అవ్వాలని ముందు ఉప్పు వేసి కాలిఫ్లవర్ ను మగ్గించేస్తారు. ఇలా అస్సలు చేయకండి. చివర్లో ఉప్పు వేస్తే కూర కూడా మంచిగా ఉంటుంది.

వంట చేసే 10 నిముషాల పాటు దీనిలో నీటిలో ఉంచాలి. కొందరు, పాన్ వేడి అవ్వకముందే కాలిఫ్లవర్ ను వేసేస్తారు. ఇలాంటి తప్పులను అస్సలు చేయకండి.