ప్రతి ఇంట్లో టీవీ అనేది నిత్యవసర వస్తువుగా మారింది. ఏది ఉన్నా లేకపోయినా.. ముందు టీవీ ఉండాలి. ఇంట్లో టీవీ ఉంటే.. కాలక్షేపంగా ఫీల్ అవుతూ ఉంటారు. ఎంటర్టైన్ మెంట్ అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక భాగం అయిపోయింది. ఏజ్ ఉన్న యూత్ పర్సన్స్ కి అయితే ప్రతి ఒక్కరి చేతిలో ఫోన్ ఉంటుంది కాబట్టి.. వారి దాన్ని చూసుకుంటూ ఉంటారు. కానీ పెద్దవాళ్లు, చిన్న వాళ్లకు మాత్రం టీవీనే ప్రపంచం. ఇప్పుడు ఏకంగా లక్షలకు లక్షలు పోసి టీవీలను కొనేస్తున్నారు.
టీవీల్లో కూడా చాలా రకాలు వచ్చాయి. ఎల్ఈడీ టీవీలు, స్మార్ట్ టీవీలు ఉంటున్నాయి. గతంలో పోల్చుకుంటే టీవీల్లో ఎన్నో మార్పులు వచ్చాయి. ఇన్ని లక్షలకు లక్షలు ఖర్చు పెట్టి టీవీలను కొంటున్నారు కానీ.. వాటిని ఎలా జాగ్రత్తగా చూడాలి.. ఎలా క్లీన్ చేసుకోవాలి అన్న విషయాన్ని మాత్రం పక్కకు పెట్టేస్తున్నారు. మరి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
టీవీలకు ఎప్పుడూ దగ్గరగా కూర్చోకూడదట. అలాగే టీవీ చూడటం అయి పోయిన తర్వాత టీవీపై క్లాత్ కప్పాలి. టీవీ హీట్ గా ఉన్నప్పుడు కాకుండా.. కాస్త తక్కువ హీట్ లో ఉన్నప్పుడు కప్పాలి. దీని వల్ల డస్ట్ అనేది టీవీ లోపలికి వెళ్లకుండా ఉంటుంది.
చిన్న పిల్లలకు తెలీదు కాబట్టి.. వారిని టీవీకి వీలైనంత వరకూ దూరంగా ఉంచాలి. టీవీలను చాలా మంది తడి క్లాత్ తో తుడుస్తూ ఉంటారు. ఇలా అస్సలు చేయకూడదు. టీవీని క్లీన్ చేయాలి అనుకుంటే మెత్తగా ఉన్న పొడి క్లాత్ తోనే శుభ్రం చేసుకోవాలి.
సాధారణంగా కరెంట్ వస్తూ పోతూ ఉంటుంది కాబట్టి.. టీవీ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వోల్టేజ్ ఎక్కువగా వస్తున్నప్పుడు షార్ట్ సర్క్యూట్ అయ్యి టీవీ పాడయ్యే ప్రమాదం ఉంది. అందుకే టీవీకి స్టెబిలైజర్ సపరేట్ గా ఉండాలి. అలాగే టీవీని సొంతంగా రిపేర్ చేయకపోవడమే మంచిది.