
తులసి పవిత్రమైన మొక్కగా భావిస్తారు. సాక్షాత్తు లక్ష్మీ స్వరూపంగా కొలుచుకుంటారు. తులసి కోట ఉండే ప్రదేశం తీర్థ స్థలమని, గంగాతీరంతో సమానమైన పవిత్రత కలిగి ఉంటుందని పండితులు చెబుతారు. ఉదయం నిద్ర లేవగానే తులసి దర్శనం చేసుకుంటే సమస్త తీర్థాలను దర్శించిన ఫలితం దక్కుతుందని చెబుతారు.

తులసి మొక్క పెట్టుకునే చోట పరిసరాల్లో చెప్పులు ఉంచకూడదు. ఇలా ఉంచితే తులసికి మాత్రమే కాదు.. లక్ష్మీ అమ్మవారిని కూడా అవమానపరిచినట్టవుతుంది. తులసి మొక్క పరిసరాల్లో తప్పనిసరిగా పరిశుభ్రంగా ఉంచుకోవాలి.

తులసి విష్ణు మూర్తికి అత్యంత ప్రీతికరం. అందుకే తులసి ఆరాధన చాలా మంచి ఫలితాలను ఇస్తుంది. తులసి దగ్గర ఎప్పుడూ చీపురు పెట్టకూడదు. చీపురు పెడితే అటు విష్ణుమూర్తిని ఇటు లక్ష్మీ దేవిని ఇద్దరినీ అవమాన పరచినట్టవుతుంది. ఇది ఆర్థిక నష్టాలకు కారణం కావచ్చు.

తులసి వంటి మహిమాన్విత మొక్కను ముళ్లు కలిగిన మొక్కలతో కలిపి ఉంచకూడదు. ఇది చాలా అశుభం. ఇలా ముళ్ల మొక్కల పరిసరాల్లో తులసి మొక్కను ఉంచితే అది కుటుంబ సభ్యుల మధ్య విబేధాలకు కారణం కావచ్చు.

తులసి మొక్క పరిసరాల్లో చెత్త బుట్ట కూడా ఉండ కూడదు. ఇలా ఉంచితే ఇంట్లోకి నెగెటివ్ ఎనర్జీ చేరుతుందని నిపుణులు చెబుతున్నారు.