Ram Naramaneni |
Aug 19, 2021 | 6:58 PM
విజయనగరం జిల్లా పోలీసులు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మహిళల్లో ధైర్యం నింపేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన దిశా యాప్ వినియోగంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రయత్నిస్తున్నారు.
విజయనగరంలో మహిళలు, యువతులు తమ మొబైల్ ఫోన్‌లలో దిశా యాప్‌ను చూపిస్తే.. పట్టణంలోని ముఖ్య కూడళ్ల నుంచి ఇతర ప్రాంతాలకు ఉచితంగా ప్రయాణించే అవకాశం కల్పిస్తున్నట్టు ఎస్పీ దీపికా పాటిల్ వెల్లడించారు.
తాజాగా విద్యార్థినిలతో కలిసి జిల్లా ఎస్ పి దీపికా పాటిల్ బస్సులో ప్రయాణించారు. దిశా యాప్‌కు గురించి స్వయంగా వారికి అవగాహన కల్పించారు.
పోలీసుల ప్రచారానికి విశేష స్పందన లభిస్తోంది. ఇరవై రోజుల్లో మూడు లక్షల ముప్పై వేల మంది మహిళలు దిశ యాప్ ను డౌన్ లోడ్ చేసుకున్నారు.
మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలకు చెక్ పెట్టేందుకు దిశా యాప్ ను డెవలప్ చేసింది ఏపీ ప్రభుత్వం. మహిళల మానప్రాణాల రక్షణే ప్రధాన తమ కర్తవ్యమని చెబుతూ దిశ యాప్‌కు విస్తృత ప్రచారం కల్పిస్తోంది.