
ఈ మామిడి పండు అంత ధర పలకడానికి కొన్ని ముఖ్యమైన కారణాలు ఉన్నాయి ఇవి చూడటానికి ముదురు ఎరుపు లేదా ఊదా రంగులో మెరుస్తూ ఉంటాయి. సూర్యరశ్మి నేరుగా పండుపై పడటం వల్ల వీటికి ఈ రంగు వస్తుంది.

అలాగే వీటిని పండించడం చాలా కష్టమైన పని. జపాన్‌లోని మియాజాకి నగరంలో వీటిని అత్యంత జాగ్రత్తగా పండిస్తారు. ప్రతి పండుకు ఒక నెట్ కట్టి, అది కింద పడకుండా, దెబ్బతినకుండా చూస్తారు.

ఈ చెట్టుకు కాసే ప్రతి పండు కనీసం 350 గ్రాముల బరువు ఉండాలి. అలాగే అందులో చక్కెర శాతం 15శాతం కంటే ఎక్కువగా ఉంటేనే దానిని 'మియాజాకి' బ్రాండ్‌తో అమ్ముతారు.ఇది నోట్లో వేసుకోగానే కరిగిపోయేంత మృదువుగా, జ్యూసీగా ఉంటుంది. అంతే కాదు ఈ పండ్లను కోసినప్పుడు దీని వాసన గది అంతా వ్యాపిస్తుంది.

ధర ఎంత ఉంటుంది?: ఇక ఈ పండు ధర విషయానిక వస్తే.. అంతర్జాతీయ మార్కెట్‌లో ఒక కిలో మియాజాకి మామిడి పండ్ల ధర సుమారు రూ. 2.5 లక్షల నుండి రూ. 3 లక్షల వరకు ఉంటుంది. అంటే ఈ ధరకు మన ఒక మంచి సెకండ్ హ్యాండ్ కారు లేదా ఒక లగ్జరీ బైక్‌ను కొనేయవచ్చు.

జపాన్‌కే పరిమితమైన ఈ పండు ఇప్పుడు భారతదేశంలో కూడా వార్తల్లో నిలిచింది. మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌కు చెందిన ఒక రైతు తన తోటలో ఈ చెట్లను పెంచారు. ఆ పండ్లు దొంగతనం కాకుండా ఉండటానికి ఆయన ఏకంగా సెక్యూరిటీ గార్డులను, వేట కుక్కలను కాపలాగా పెట్టడం అప్పట్లో సోషల్ మీడియాలో పెద్ద సంచలనమైంది.