- Telugu News Photo Gallery Did Your Mobile Charge Percentage Also Going Down Rapidly? Know the reasons
Mobile Charging: మీ మొబైల్ ఛార్జింగ్ వేగంగా తగ్గిపోతుందా? ఇది కారణం కావచ్చు..
నేటి కాలంలో ప్రతి ఒక్కరి జీవితంలో మొబైల్ ఫోన్లు భాగమయ్యాయి. మొబైల్ ఫోన్ లేకుంటే ఒక్క నిమిషం కూడా గడవలేని పరిస్థితి. చాలా మంది నిద్ర లేవగానే చాలా మంది చేసే మొదటిపని మొబైల్ చూడటం. నిద్రపోయే ముందు చేసే చివరి పని కూడా మొబైల్ చూడటమే..
Updated on: Sep 23, 2024 | 9:30 PM

నేటి కాలంలో ప్రతి ఒక్కరి జీవితంలో మొబైల్ ఫోన్లు భాగమయ్యాయి. మొబైల్ ఫోన్ లేకుంటే ఒక్క నిమిషం కూడా గడవలేని పరిస్థితి. చాలా మంది నిద్ర లేవగానే చాలా మంది చేసే మొదటిపని మొబైల్ చూడటం. నిద్రపోయే ముందు చేసే చివరి పని కూడా మొబైల్ చూడటమే.

అయితే ఒక్కోసారి మొబైల్ ఛార్జింగ్ సరిగ్గా ఎక్కదు. దీంతో పూర్తిగా ఛార్జ్ అయినప్పటికీ కేవలం కొద్ది నిమిషాల్లోనే 30-40 శాతానికి పడిపోతుంది. మీ ఫోన్‌కు కూడా ఇలాంటి సమస్య ఉందా? అయితే ఈ సమస్య మీ ఫోన్‌లో ఉండవచ్చు.

అన్నింటిలో మొదటిది.. ఫోన్‌కు ఎల్లప్పుడూ 100 శాతం ఛార్జ్ చేయకూడదు. అలాగే ఛార్జింగ్ 20 శాతం కంటే తక్కువగా ఉంటే, వెంటనే ఫోన్‌ను ఛార్జ్ చేయాలి. ఫోన్ ఆలస్యంగా ఛార్జ్ కావడానికి ఒక కారణం సరైన ఛార్జర్ వినియోగించకపోవడం. ఛార్జింగ్ పోర్ట్ లేదా అడాప్టర్‌లో ఏదైనా సమస్య ఉంటే మొబైల్ ఛార్జింగ్ అవ్వడానికి చాలా సమయం పడుతుంది.

మొబైల్ ఛార్జింగ్ సమస్యలు చాలా వేడి లేదా చల్లని వాతావరణంలో తరచూ సంభవిస్తాయి. అధిక ఉష్ణోగ్రతల్లో మొబైల్ ఛార్జింగ్ ఆలస్యం అవుతుంది. అలాగే ఛార్జింగ్ పెట్టే సమయంలో ఫోన్ వాడకూడదు. దీంతో ఫోన్ బ్యాటరీపై ఒత్తిడి పడుతుంది. దీని వల్ల ఛార్జింగ్ సమస్యలు తలెత్తుతాయి. ఫోన్ ఆలస్యంగా ఛార్జ్ అవుతోంది.

కొన్నిసార్లు ఛార్జింగ్ పోర్ట్ మురికిగా ఉంటుంది. దుమ్ము పేరుకుపోవడం వల్ల ఛార్జింగ్‌లో సమస్య తలెత్తుతుంది. అందువల్ల ఎప్పటికప్పుడు ఛార్జింగ్ పోర్ట్ క్లీన్‌గా ఉంచుకోవడానికి ప్రయత్నించాలి.




