బరువు తగ్గాలనుకుంటే జీలకర్రని తీసుకోవడం మంచిది. జీలకర్రను తీసుకోవడం వల్ల అధిక బరువు సమస్య నుంచి సులువుగా బయటపడొచ్చు. షుగర్ ఉన్నవారు జీలకర్రని తీసుకుంటే మంచిది. టైప్-2 డయాబెటిస్ కంట్రోల్ అవుతుంది. ఇన్సులిన్ స్థాయిలు నియంత్రిస్తాయి. రక్తంలో చక్కెర లెవెల్స్ అదుపులో ఉంచుకోవచ్చు. రోగనిరోధక శక్తిని పెంచడంలో జీలకర్ర నీరు కూడా చాలా ఉపయోగపడుతుంది.
ఒత్తిడిని తగ్గించుకోవడానికి జీలకర్ర బాగా పనిచేస్తుంది. జీలకర్రలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. జీలకర్రను తీసుకుంటే ఆందోళన, డిప్రెషన్ వంటి సమస్యలు కూడా ఉండవు. జ్ఞాపకశక్తిని పెంచుకోవడానికి జీలకర్ర బాగా పనిచేస్తుంది. జీలకర్రని తీసుకుంటే మెదడు చురుకుగా పని చేయడమే కాకుండా మెదడు ఆరోగ్యం మెరుగుపడుతుంది.
క్యాన్సర్ సమస్యని అడ్డుకోవడానికి జీలకర్ర బాగా పనిచేస్తుంది. లివర్ క్యాన్సర్, పెద్ద ప్రేగు క్యాన్సర్ వంటి వాటి నుంచి దూరంగా ఉంచుతుంది. మంచి నిద్రని పొందాలంటే జీలకర్రను తీసుకోవాలంటున్నారు నిపుణులు. ఇందులో ఉండే మెలటోనిన్ హాయిగా నిద్ర పట్టేటట్టు చూస్తుంది. దీంతో నిద్రలేమి సమస్య నుంచి సులువుగా బయటపడవచ్చు.
జీలకర్రలో అనేక ఔషధ గుణాలు ఉన్నాయి. ప్రతిరోజూ ఖాళీ కడుపుతో జీలకర్ర నీరు తాగడం వల్ల అనేక వ్యాధుల నుండి మిమ్మల్ని రక్షించుకోవచ్చు. జీలకర్ర గింజల్లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. కాబట్టి ఇది మీ ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.
జీలకర్ర నీరు కడుపుకు చాలా మంచిది. నిజానికి, జీలకర్ర నీటిని ఆమ్లత్వం, ఉబ్బరం, అజీర్ణం, కడుపు నొప్పికి దివ్యౌషధంగా పరిగణిస్తారు. జీలకర్ర నీరు జీర్ణ ప్రక్రియను వేగవంతం చేస్తుంది. తద్వారా పేగు సమస్యలను కూడా తొలగిస్తుంది. గర్భధారణ సమయంలో జీర్ణక్రియ మెరుగుపడుతుంది. అయితే, గర్భిణీ స్త్రీలు వైద్యుడిని సంప్రదించిన తర్వాత దీనిని తీసుకోవడం మంచిది.