Puffed Rice: మరమరాలతో డయాబెటీస్ కంట్రోల్.. ఇంకా ఎన్నో లాభాలు..
మరమరాలు కేవలం రుచి కోసం మాత్రమే అనుకుంటారు. కానీ మరమరాలు ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. ఇందులో అనేక పోషకాలు లభిస్తాయి. మరమరాలతో తయారు చేసిన ఫుడ్స్ తరచూ తీసుకుంటే అనేక రకాల సమస్యలు రాకుండా జాగ్రత్త పడొచ్చు..
మరమరాల గురించి ప్రత్యేకించి పరిచయాలు అవసరం లేదు. మరమరాల గురించి, వీటి రుచి గురించి చాలా మందికి తెలుసు. వీటిని స్నాక్స్, టిఫిన్స్ రూపంలో కూడా తీసుకుంటూ ఉంటారు. పిల్లల నుంచి పెద్దల వరకు ఇవి అంటే చాలా మందికి ఇష్టం. రుచి మాత్రమే కాకుండా వీటితో అనేక హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి.
డయాబెటీస్‌తో బాధ పడేవారు మరమరాలు తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో ఫైబర్ అనేది అధికంగా ఉంటుంది కాబట్టి.. కొద్దిగా తిన్నా త్వరగా కడుపు నిండుతుంది. దీంతో రక్తంలో చక్కెర లెవల్స్ పెరగకుండా ఉంటాయి. షుగర్ వ్యాధి ఉన్నవారు మరమరాలతో చేసిన ఫుడ్స్ తీసుకుంటే బెస్ట్.
మరమరాలు తింటే జీర్ణ సమస్యలు కూడా రాకుండా ఉంటాయి. అజీర్తి, గ్యాస్, మలబద్ధకం సమస్య ఏర్పడదు. తిన్న ఆహారం త్వరగా జీర్ణమవుతుంది. అలాగే మరమరాలు తిన్న వెంటనే శక్తి లభిస్తుంది. దీంతో ఎనర్జిటిక్‌గా ఉంటారు.
మరమరాలు తినడం వల్ల మెదడు ఆరోగ్యం కూడా మెరుగు పడుతుంది. ఇందులో ఉండే విటమిన్ బి.. బ్రెయిన్‌ని, శరీరాన్ని యాక్టీవ్‌గా ఉంచేందుకు సహాయ పడుతుంది. దీంతో మతిమరుపు సమస్య తగ్గుతుంది.
అధిక బరువుతో బాధ పడేవారు మరమరాలను తరచూ తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. మరమరాలతో చేసిన ఆహారాలు తక్కువగా తీసుకున్నా త్వరగా కడుపు నిండుతుంది. శరీరంలో పేరుకుపోయిన కొవ్వు కూడా కరుగుతుంది. దీంతో త్వరగా వెయిట్ లాస్ అవుతారు.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)