దీపావళి.. సత్యయుగంలో ఆశ్వయుజ మాసంలోని అమావాస్యనాడు సముద్ర మథనం నుండి లక్ష్మీదేవి తొలిసారిగా ఉద్భవించింది. ఈ రోజున శ్రీ మహా విష్ణువు, లక్ష్మి దేవి వివాహం జరిగినట్లు పురాణ కథనం. అప్పటి నుంచి దీపావళి సంబరాలు మొదలయ్యాయి. తరువాత త్రేతాయుగంలో ఈ రోజున, రాముడు వనవాసం నుండి ఇంటికి తిరిగి వచ్చాడు. ఈ రోజు మహాలక్ష్మిని పూజిస్తారు. ఈ సంవత్సరం దీపావళి పండుగను 12 నవంబర్ 2023 న జరుపుకోనున్నారు.
అందుకే ధన త్రయోదశి రోజు ఇంట్లోకి అవసరం అయ్యే కొన్ని రకాల వస్తువులను కొంటూంటారు. అలాగే పలు కంపెనీలు కూడా దీపావళి పండక్కి బోనస్ లు కూడా ప్రకటిస్తుంది. మరి ధన త్రయోదశి రోజు ఎలాంటి వస్తువులు కొంటే మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం.
బంగారం - వెండి వస్తువులు: ధన త్రయోదశి రోజు బంగారం లేదా వెండి వస్తువులు కానీ, ఆభరణాలు కానీ కొంటే అదృష్టం లభిస్తుందని నమ్ముతూంటారు. ఎందుకంటే ధన త్రయోదశి రోజు ఏం కొంటే అవి ఇంట్లో స్థిరంగా ఉంటాయని విశ్వసిస్తూంటారు.
ఎలక్ట్రానిక్ గాడ్జెట్లు - వంటగది పాత్రలు: ఇల్లును ఎంత నీటిగా అందంగా ఉంటే లక్ష్మీ దేవి అనుగ్రహం కలుగుతుందని, ధన త్రయోదశి రోజు ఎలక్ట్రానిక్ గాడ్జెట్లు, వంటగది పాత్రలు కూడా కొంటున్నారు. కొత్త వస్తువులతో ఇంటిని అలంకరిస్తున్నారు. పలు కంపెనీలు కూడా మంచి మంచి ఆఫర్లను ప్రకటిస్తున్నాయి.
దీపాలు: దీపావళి అంటేనే దీపాల పండుగ. దీపావళి పండుగకు ఎంతో చక్కగా దీపాలను అలంకరిస్తే.. ఆ ఇంటికి ఉండే లుక్కే మారి పోతుంది. దీపావళి రోజున ఇంటిని రంగు రంగుల దీపాలతో అలంకరిస్తే.. లక్ష్మీ దేవి అనుగ్రహం కలుగుతుందని అందరూ విశ్వసిస్తూంటారు. అంతే కాకుండా ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ నెలకొంటుంది.