
ఈ ఏడాది అక్షయ తృతీయ పండుగ ఏప్రిల్ 30వ తేదీ బుధవారం నాడు వచ్చింది. ఎవరైనా ఈ ఏడాది ఏదైనా కొత్త పని ప్రారంభించాలనుకుంటే అందుకు ఈరోజు పవిత్రంగా ఉంటుందని పండితులు చెబుతున్నారు. అంతేకాదు ఈసారి వచ్చిన అక్షయ తృతీయ వేళ అనేక శుభ యోగాలు ఏర్పడనున్నాయని చెబుతున్నారు.

అక్షయ తృతీయ రోజున.. శంఖంను కొనుగోలుచేయటం కూడా మంచిదని జ్యోతిశాస్త్ర నిపుణులు చెబుతున్నారు. దీని నుంచి వెలువడే ధ్వని ఇంట్లోని నెగెటివ్ ఎనర్జీని దూరం చేస్తుందని చెబుతున్నారు. అంతే కాకుండా.. ఇంట్లో ధనాన్ని ఎప్పటికీ ఖాళీ కానివ్వదు అంటున్నారు.

అక్షయ తృతీయ రోజున పరిగెడుతున్న గుర్రాల ఫోటోల్ని ఇంట్లో పెట్టుకుంటే కలిసి వస్తుందని చెబుతున్నారు. అదే విధంగా.. కొత్త చీపురు, ఏదైన కొత్త వాహనం, పసుపు కొమ్ము కొనుగోలు చేస్తే వారికి ఏడాది పొడువుగా కలసి వస్తుందని పండితులు చెబుతున్నారు. అంతే కానీ బంగారం, వెండి.. ఇతర కాస్లీ ఐటమ్స్ తీసుకుంటేనే ధనం మీ ఇంట్లో నిలుస్తుందని ఎక్కడ రాసిపెట్టి లేదని పండితులు చెబుతున్నారు.

అక్షయ తృతీయ రోజున ఒకవైపు కొబ్బరికాయ, దక్షిణావర్తి శంఖం, శివలింగాన్ని కొనుగోలు చేసి ఇంటికి తీసుకురావడాన్ని శుభప్రదంగా పరిగణిస్తారు. ఈ రోజున మీరు చేసే పూజలు, వ్రతాలు, ధ్యానాలు, అన్ని కూడా రెట్టింపు ఫలితాలను ఇస్తాయని పండితులు చెబుతున్నారు.

వెండిని పవిత్రమైన, స్వచ్ఛమైన లోహంగా చూస్తారు. లక్ష్మీ-గణేష్ నాణేలు లేదా పూజా పాత్రలు కొనడం వల్ల శుభ ఫలితాలు వస్తాయి. రాగి లేదా ఇత్తడి పూజా వస్తువులు కూడా కొనుగోలు చేయవచ్చు. ఇంటి కోసం కొత్త కలశం, గంట లేదా దీపం కొనడం కూడా చాలా శుభప్రదం అంటున్నారు జ్యోతిశాస్త్ర నిపుణులు.