
కాలం ఏదైనా పెరుగు తినడం వల్ల ఆరోగ్యానికి చలవ చేస్తుందంటున్నారు పోషకాహార నిపుణులు. జలుబు చేస్తుందనో, లావైపోతామనో కొందరు పెరుగుని పూర్తిగా దూరం పెడుతుంటారు. దీన్ని రోజువారీ ఆహారంలో భాగంగా తినేవారి జీవితకాలం పెరిగిందని పలు అధ్యయనాల్లో తేలింది. అంతేకాదు అధిక కాలం యవ్వనంగా కూడా ఉండొచ్చట.

రోజూ ఒక గిన్నె పెరుగు తింటే జీర్ణక్రియ బాగా జరుగుతుంది. ఇది ఎముకలకు ఎంతో మేలు చేకూరుతుంది. దీన్ని తీసుకోవడం వల్ల కీళ్ల నొప్పుల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది.

రోజూ ఒక గిన్నె పెరుగు తింటే చర్మం తాజాగా ఉంటుంది.చలికాలంలో రోజులో ఒక గిన్నె పెరుగు తింటే నిద్ర సమస్యలు తగ్గుతాయి. పెరుగులో బరువు తగ్గడానికి సహాయపడే అనేక రకాల ఫైబర్స్ ఉంటాయి.

చల్లటి వాతావరణంలో పెరుగు తినడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. పెరుగులో మెగ్నీషియం, క్యాల్షియం, విటమిన్లు ఉంటాయి. దీన్ని రోజూ తినడం వల్ల శరీరంలో మంచి బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది.

జీర్ణవ్యవస్థని మెరుగుపరచి మలబద్ధకాన్ని అదుపులోకి ఉంచుతుంది. పెరుగు రోజూ తీసుకుంటే ఇందులోని ప్రోబయోటిక్స్ మూత్రపిండాల వ్యాధులను అదుపులో ఉంచుతాయి. రక్తంలో గ్లూకోజ్ స్థాయులను తగ్గించి, రక్త సరఫరాను సమన్వయం చేస్తుంది.