Cucumbers On Eyes: అమ్మాయిలు కళ్లపై కీరదోస ముక్కలు ఎందుకు పెట్టుకుంటారో తెలుసా?

Updated on: May 23, 2024 | 12:51 PM

అందం కోసం కళ్లపై కీర దోస ముక్కలు ఉంచుకోవడం సాధారణమే. దాదాపు ప్రతి ఒక్కరూ దీన్ని పాటిస్తారు. ముఖ్యంగా మేకప్ ప్రారంభానికి ముందు లేదా ఫేస్‌ప్యాక్ వేసేటప్పుడు కీర దోస ముక్కలను కళ్లపై పెట్టుకుంటూ ఉంటారు. నిజానికి, కళ్ల మీద దోసకాయ ముక్కలు ఎందుకు పెడతారో తెలుసా? కీర దోస ముక్కలు కంటి చుట్టూ ఉండే నల్లటి వలయాలను తగ్గించడంలో సహాయపడుతుంది. అలాగే అనేక ఇతర ప్రయోజనాలు కూడా ఉన్నాయి..

1 / 5
అందం కోసం కళ్లపై కీర దోస ముక్కలు ఉంచుకోవడం సాధారణమే. దాదాపు ప్రతి ఒక్కరూ దీన్ని పాటిస్తారు. ముఖ్యంగా మేకప్ ప్రారంభానికి ముందు లేదా ఫేస్‌ప్యాక్ వేసేటప్పుడు కీర దోస ముక్కలను కళ్లపై పెట్టుకుంటూ ఉంటారు. నిజానికి, కళ్ల మీద దోసకాయ ముక్కలు ఎందుకు పెడతారో తెలుసా? కీర దోస ముక్కలు కంటి చుట్టూ ఉండే నల్లటి వలయాలను తగ్గించడంలో సహాయపడుతుంది. అలాగే అనేక ఇతర ప్రయోజనాలు కూడా ఉన్నాయి.

2 / 5
చర్మ సంరక్షణలో కీర దోస గ్రేట్ గా పనిచేస్తుంది. దోసకాయ శీతలీకరణ ప్రభావాన్ని కలిగి ఉంటుంది. ఇది చర్మానికి చల్లదనాన్ని, తాజాదనాన్ని తెస్తుంది. కీర దోస వల్ల అనేక చర్మ సమస్యలు తగ్గుతాయి. ముఖ్యంగా, కీర దోస కళ్ల చుట్టూ ఉన్న వేలాది చర్మ సమస్యలను నయం చేస్తుంది.

3 / 5
కళ్ల చుట్టూ ఉన్న కణజాలాన్ని హైడ్రేట్ చేయడానికి కీర దోస సహాయపడుతుంది. కీర దోసలో లిగ్నాన్స్ ఉండటం వల్ల చర్మం మంటను తగ్గిస్తుంది. అందుకే కీర దోసను కళ్లపై పెట్టుకోవడం వల్ల కళ్లు సేదతీరుతాయి. కీర దోసలో విటమిన్ కె అధిక మొత్తంలో ఉంటుంది. ఈ పదార్ధం డార్క్ సర్కిల్స్ సమస్యను తగ్గించడంలో సహాయపడుతుంది. కీర దోసలో మెలనిన్ ఉత్పత్తిని తగ్గించే ఎంజైమ్ కూడా ఉంటుంది. దీని వల్ల డార్క్ సర్కిల్స్ నివారించవచ్చు.

4 / 5
కీర దోస రసం వల్ల కళ్ల చుట్టూ చర్మం మెరుగ్గా ఉంటుంది. అలాగే కంటి లోపల మంటగా ఉన్నా కీర దోస రసాన్ని ఉపయోగించవచ్చు. ఎక్కువ సమయం ల్యాప్‌టాప్ లేదా మొబైల్ ఫోన్ ఉపయోగించేవారు కీర దోస ముక్కలను కళ్లపై పెట్టుకుంటే కళ్ల అలసటను తీరుస్తుంది.

5 / 5
కీర దోస ముక్కను కళ్లపై ఉంచడం వల్ల రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. ఇది కళ్ల కింద వాపును తగ్గిస్తుంది. ఈ ట్రిక్ కళ్ళ ఎరుపు, అసౌకర్యాన్ని తగ్గిస్తుంది. వారానికి ఒకసారి లేదా నెలకు రెండుసార్లు కీర దోస ముక్కలను కళ్లపై ఉంచడం కన్నా.. ప్రతిరోజూ 10-15 నిమిషాల పాటు కీర దోస ముక్కలను కళ్లపై ఉంచడానికి ప్రయత్నించాలి. లేదంటే కనీసం కీర దోస రసం అయినా కళ్ల చుట్టూ రాసుకోవాలి. అప్పుడే ప్రయోజనం కలుగుతుంది.