
నేటి కాలంలో మధుమేహ వ్యాధిగ్రస్తుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు కూడా వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరినీ ఈ వ్యాధి వేధిస్తోంది. ఈ ఆరోగ్య సమస్య ఉన్నవారికి రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుకోవడం చాలా అవసరం. అందుకే తినే ఆహారం విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి.

మధుమేహంతో బాధపడేవారు తరచుగా మూత్ర విసర్జన సమస్యలతో బాధపడుతుంటారు. తరచుగా మూత్రవిసర్జన చేయడం వల్ల శరీరంలో డీహైడ్రేషన్ ఏర్పడుతుంది. ఈ సమస్యను నివారించాలంటే కీరదోస క్రమం తప్పకుండా తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

సాధారణంగా బరువు పెరగడం వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి. అయితే కీరదోస తినడం స్థూలకాయాన్ని నివారిస్తుంది. బరువును నియంత్రిస్తుంది. శరీరంలో స్థూలకాయం పెరిగితే మధుమేహం వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి కీరదోస ఊబకాయం ప్రమాదాన్ని తగ్గిస్తుంది. తద్వారా బ్లడ్ షుగర్ కూడా కంట్రోల్‌లో ఉంటుంది.

కీరదోసలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. దీన్ని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల శరీరానికి శక్తిని అందించి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. కీరదోసకాయలో పీచు ఎక్కువగా ఉండటం వల్ల జీర్ణక్రియకు తోడ్పడుతుంది. ఆహారాన్ని జీర్ణం చేసి కడుపు సమస్యలను నివారిస్తుంది.

Cucumber