
ఇప్పుడంటే అన్ని ఉన్నాయి మరి మన తాతాల కాలంలో మిక్సీలు, గ్రైండర్లు లేవు. అప్పుడు చేత్తోనే పచ్చళ్లు చేసుకునే వాళ్ళు. వాటిలో దోసకాయ పచ్చడి బాగా తినేవాళ్లు. దీని కోసం పెద్దగా శ్రమ కూడా అవసరం కూడా లేదు. తక్కువ సమయంలోనే ఈజీగా చేసేయొచ్చు. ఇంకా సహజమైన రుచితో చేసే ఈ పచ్చడి అన్నంలోకి మంచిగా ఉంటుంది.

దోసకాయ పచ్చడికి కావలసిన పదార్థాలు: రెండు పెద్ద దోసకాయ, 100 గ్రాముల పచ్చిమిర్చి, 4 వెల్లుల్లి రెబ్బలు, రుచికి సరిపడా ఉప్పు , అలాగే కొద్దిగా కొత్తిమీర , ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం, రెండు టేబుల్ స్పూన్స్ నూనె, అర టీ స్పూన్ ఆవాలు, అర టీ స్పూన్ జీలకర్ర, అర టీ స్పూన్ మినప్పప్పు , నాలుగు ఎండు మిర్చి ఎండుమిర్చి , నాలుగు కరివేపాకు ఆకులు తీసుకోవాలి.

దోసకాయ చేతి పచ్చడి తయారీ విధానం: ముందుగా దోసకాయను తీసుకుని బాగా కడిగి దాని మీద తొక్కలను తీసి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు పచ్చిమిర్చిని తీసుకుని కాల్చి ఆ తరవాత వీటిని కూడా చేతితోనే నలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద గిన్నెలో కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలు, పచ్చిమిర్చి పేస్ట్ , వెల్లుల్లి ముక్కలు , ఉప్పు కూడా వేసి చేత్తోనే నలిపి మంచిగా కలపాలి.

దోసకాయలో ఉండే రసంతోనే ఈ పచ్చడి తయారవుతుంది ఇంకా దీనిని కలుపుతూ ఉండాలి. ఇక చివర్లో చివరగా కొత్తిమీర, రెండు టేబుల్ స్పూన్స్ నిమ్మరసం కూడా వేసి ఇంకోసారి కలపాలి. పాన్‌లో ఆయిల్ వేసి దానిలో కొద్దిగా ఆవాలు, అర టీ స్పూన్ జీలకర్ర, మినప్పప్పు, నాలుగు ఎండుమిర్చి, కరివేపాకు ఆకులు కూడా వేసి పోపు పెట్టాలి.

ఈ పోపును తీసుకుని పచ్చడిపై పోసి చేతితోనే కలపాలి. అంతే టేస్టీ టేస్టీ దోసకాయ పచ్చడి రెడీ. కొంచం లేత దోసకాయలు వాడితే పచ్చడి రుచిగా వస్తుంది అలాగే కారం ఎక్కువ తినేవాళ్లు పచ్చిమిర్చిని కూడా వేసుకోవచ్చు. ఇంకా దీనిని వేడి వేడి అన్నం, నెయ్యితో తింటే ఈ పచ్చడి అద్భుతంగా ఉంటుంది. చేసిన వెంటనే తింటే అదిరిపోతోంది.