
నవ్వడం ఒక 'భోగం' నవ్వించడం ఒక 'యోగం' అంటారు.. మనస్ఫూర్తిగా నవ్వడం వలన ఆరోగ్యం కూడా. మరి ఏడిస్తే అనారోగ్యమా? అంటే కానే కాదంటున్నారు నిపుణులు. ఏడవడం వల్ల కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని చెబుతున్నారు. మరి ఏడవడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో ఇవాళ మనం తెలుసుకుందాం..

ఓ పరిశోధన ప్రకారం.. భావోద్వేగాలను వదిలించుకోవడానికి, మానసిక ప్రశాంతతను పొందడానికి కన్నీళ్లు సహాయపడుతాయి. ఏడుపు మనకు తీవ్రమైన భావోద్వేగాలను ఎదుర్కోవడానికి సహాయపడుతుంది.

ఏడవటం వలన ప్రశాతంగా ఉంటారు. ఏడుపు పారాసింపథెటిక్ నాడీ వ్యవస్థను సక్రియం చేస్తుందని పరిశోధనలో తేలింది. కాసేపు ఏడవడం వల్ల ప్రశాంతంగా ఉంటారు.

దీర్ఘకాలం ఏడుపు ఆక్సిటోసిన్, ఎండార్ఫిన్‌లను విడుదల చేస్తుంది. ఈ ఫీల్ గుడ్ కెమికల్స్ శారీరక, మానసిక బాధలను తగ్గించడంలో సహాయపడుతుంది.

ఏడుపు ఒత్తిడి నుంచి ఉపశమనం పొందించే హార్మోన్లను విడుదల చేస్తుంది. ఇది మిమ్మల్ని ప్రశాంతంగా చేస్తుంది. ఎక్కువ బాధలో ఉన్నప్పుడు వచ్చే ఏడుపు సహజమైనది. దీని వలన ఆరోగ్యం మెరుగవుతుంది.

ఏడుపు మన కళ్ల ఆరోగ్యానికి కూడా మంచిది. ఇది దుమ్ము, దూళి, చెత్త నుంచి కళ్లను రక్షిస్తుంది. కన్నీటి ద్వారా కళ్లను శుభ్రం చేస్తుంది. ఆరోగ్యంగా ఉంచుతుంది. అంతేకాదు.. ఏడవడం వలన మనసులో బాధ కూడా తగ్గిపోతుంది.

ఇక సన్నిహిత వ్యక్తితో తమ బాధలను పంచుకుని ఏడవడం వలన వారితో సంబంధం బలపడుతుంది. ఒకరినొకరు బాగా అర్థం చేసుకుంటారు. సపోర్ట్ లభిస్తుంది.