రొయ్యల వేపుడు ఇలా చేస్తే ముక్క మెత్తగా కమ్మగా ఉంటుంది.. నెలరోజుల పాటు నిల్వ ఉండే సీక్రెట్ రెసిపీ!

Updated on: Aug 15, 2026 | 3:24 PM

సీఫుడ్ ప్రియులకు రొయ్యల వేపుడు అంటే అమితమైన ఇష్టం. అయితే రొయ్యలు తెచ్చినప్పుడు వాటిని ఎలా నిల్వ చేసుకోవాలి, వండినప్పుడు ముక్క గట్టిపడకుండా జ్యూసీగా ఎలా ఉండాలి అనేది చాలామందికి పెద్ద సందేహం. సాధారణంగా పచ్చి రొయ్యలను డీప్ ఫ్రీజర్‌లో పెట్టి, వండే ముందు నీటిలో కరిగించినప్పుడు వాటి అసలైన రుచి తగ్గిపోతుంది. అలా కాకుండా రొయ్యలను ఆవగించి నిల్వ చేసుకుంటే రుచి ఏమాత్రం మారకుండా ఉంటుంది. అప్పటికప్పుడు ఐదు నిమిషాల్లో గుమగుమలాడే రొయ్యల వేపుడును ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం.

1 / 5
రొయ్యల వేపుడు కు కావలసిన పదార్థాలు: శుభ్రం చేసిన రొయ్యలు, ఉప్పు, పసుపు, నూనె, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం మరియు ఇంట్లో తయారు చేసుకున్న గరం మసాలా పొడి. రొయ్యలను ఆవగించే (నిల్వ చేసే) విధానం: ముందుగా రొయ్యలను రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. అందులో ఒక టీస్పూన్ ఉప్పు, ఒక టీస్పూన్ పసుపు, ఒక టేబుల్ స్పూన్ నూనె వేసి బాగా కలపాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి మీడియం మంటపై మూతపెట్టి ఉడికించాలి.

2 / 5
రొయ్యల్లో నుండి సహజంగానే నీరు ఊరుతుంది. ఎటువంటి అదనపు నీళ్లు పోయకుండా, ఆ ఊరిన నీరంతా పూర్తిగా ఇంకిపోయే వరకు మధ్యమధ్యలో కలుపుతూ ఉడికించాలి. నీరు పూర్తిగా ఆవిరై పొడిపొడిగా మారిన తర్వాత చల్లార్చుకోవాలి. ఈ రొయ్యలను గాలి చొరబడని డబ్బాలో పెట్టుకుని ఫ్రిజ్‌లో ఉంచితే నెల రోజుల పాటు తాజాగా నిల్వ ఉంటాయి.

3 / 5
రొయ్యల వేపుడు తయారీ విధానం: స్టవ్ వెలిగించి బాండీలో రెండు టేబుల్ స్పూన్ల నూనె పోసి వేడిచేయాలి. నూనె వేడెక్కాక అర టీస్పూన్ జీలకర్ర, తుంచిన ఎండుమిర్చి ముక్కలు, తాజా కరివేపాకు వేసి చిటపటలాడనివ్వాలి. ఇప్పుడు ఆవగించి పెట్టుకున్న రొయ్యలను సరిపడా మోతాదులో ఇందులో వేసుకోవాలి. ఇవి ఇప్పటికే ఉడికి ఉన్నాయి కాబట్టి వేగడానికి ఎక్కువ సమయం పట్టదు.

4 / 5
రొయ్యలు కొద్దిగా వేగాక రుచి చూసి తగినంత ఉప్పు, చిటికెడు పసుపు, అర టీస్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. అల్లం వెల్లుల్లి ముద్ద పచ్చివాసన పోయేంతవరకు బాగా వేయించాలి. ముందే వేస్తే అడుగు పడుతుంది కాబట్టి కాస్త వేగిన తర్వాతే వేయాలి. ఆ తర్వాత మీ కారానికి తగినట్లుగా కారం, చెక్క-లవంగ-ధనియాలతో చేసిన తాజా మసాలా పొడిని వేసి బాగా కలపాలి.

5 / 5
మసాలాలన్నీ ముక్కలకు పట్టేలా కలిపి, మూతపెట్టి రెండు నిమిషాలు చిన్న మంటపై మగ్గనిచ్చి స్టవ్ ఆపేయాలి. అంతే, ఎంతో ఘుమఘుమలాడే రొయ్యల వేపుడు సిద్ధం! ఈ రొయ్యల వేపుడు రసం, సాంబార్ లేదా పప్పు అన్నంలోకి సైడ్ డిష్‌గా అద్భుతంగా సరిపోతుంది. ఇంటికి అనుకోకుండా బంధువులు వచ్చినప్పుడు నిల్వ ఉంచిన రొయ్యలతో నిమిషాల్లో ఈ రుచికరమైన వేపుడు చేసి అందరినీ మెప్పించవచ్చు!

Loading...
Unable to load recommendations.
Follow Us