Yashasvi Jaiswal: అంత పొగరొద్దు జైస్వాల్.. ఇకపై ఎంపిక చేయబోమంటూ షాకిచ్చిన సెలెక్టర్లు.. అసలేం జరిగిందంటే?

Updated on: Jan 28, 2026 | 5:57 PM

Yashasvi Jaiswal Faces Ranji Trophy Selection Snub: యశస్వి జైస్వాల్ ప్రస్తుత రంజీ ట్రోఫీ సీజన్‌కు దూరం కావడంపై ముంబై క్రికెట్ అసోసియేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఫిట్‌నెస్ సమస్యలు లేకపోయినా, జైస్వాల్ తనకిష్టమైన మ్యాచ్‌లను మాత్రమే ఎంచుకుంటూ బోర్డ్ అధికారులకు స్పందించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో ఎంసీఏ సెలెక్టర్లు అతడిని ఇకపై ఎంపిక చేయమని తెలిపారు.

1 / 5
టీం ఇండియా యువ సంచలనం యశస్వి జైస్వాల్ ప్రస్తుత రంజీ ట్రోఫీ సీజన్‌కు దూరంగా ఉండటం చర్చనీయాంశంగా మారింది. అతడి ఫిట్‌నెస్ సమస్యలు లేనప్పటికీ, జైస్వాల్ కేవలం తనకిష్టమైన మ్యాచ్‌లలో మాత్రమే ఆడటానికి ఆసక్తి చూపుతున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి.

2 / 5
బోర్డ్ అధికారుల సంప్రదింపులకు సరిగ్గా స్పందించడం లేదని ఆరోపణలు వెలువడ్డాయి. ముంబై క్రికెట్ అసోసియేషన్ (ఎంసీఏ), జాతీయ సెలెక్టర్లు జైస్వాల్ లభ్యత గురించి ఆరా తీసినప్పుడు, వారికి సరైన సమాధానం రాకపోవడంతో అతడి వైఖరిపై విమర్శలు తీవ్రమయ్యాయి.

3 / 5
అంతర్జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు పొందిన తర్వాత దేశవాళీ క్రికెట్ పట్ల జైస్వాల్ చూపుతున్న ఈ ఉదాసీనత సరైన పద్ధతి కాదని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. జాతీయ జట్టులో స్థానం సుస్థిరం చేసుకున్న క్రీడాకారులు రంజీ వంటి ప్రతిష్టాత్మక టోర్నీలను విస్మరించడం సరికాదని వారు స్పష్టం చేశారు.

4 / 5
ఈ నేపథ్యంలో, ముంబై క్రికెట్ అసోసియేషన్ సెలెక్టర్లు ఇకపై యశస్వి జైస్వాల్‌ను జట్టులోకి ఎంపిక చేయబోమని స్పష్టంగా ప్రకటించారు. ఈ పరిణామాలతో యశస్వి జైస్వాల్ కెరీర్ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. కింది స్థాయి నుంచి స్టార్ ప్లేయర్ స్థానానికి చేరకున్న జైస్వాల్.. ఇప్పుడు ఇలా చేయడం ఏం బాగోలేదంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

5 / 5
టీమిండియా తరపున టెస్ట్ ల్లో సుస్థిర స్థానం సంపాదించుకోగా, వన్డే, టెస్ట్ ల్లో మాత్రం నిలకడగా రాణించలేకపోతున్నాడు. స్వ్కాడ్ లో ఉన్నా ప్లేయింగ్ 11లో మాత్రం నిరాశను ఎదుర్కొంటున్నాడు. రోహిత్, కోహ్లీల రిటైర్మెంట్ తర్వాత వన్డేల్లో స్థానం ఫిక్స్ చేసుకునే అవకాశం ఉంది.