
IPL 2025 RCB Captaincy News: విరాట్ కోహ్లీ మరోసారి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) సారథ్యం వహించగలడా? ఫాఫ్ డు ప్లెసిస్ విడుదలైన తర్వాత నుంచి ఇటువంటి ఊహాగానాలు కొనసాగుతున్నాయి. ఇప్పుడు RCB కెప్టెన్ ప్రశ్నపై జట్టు నుంచి ఓ కీలక ప్రకటన వచ్చింది. అదేంటో ఓసారి చూద్దాం..

ఇంగ్లాండ్ తో వన్డే సిరీస్ తర్వాత టీం ఇండియా ఆటగాళ్లు ఛాంపియన్స్ ట్రోఫీలో కనిపించనున్నారు. ఆ తరువాత, భారత ఆటగాళ్ళు ఐపీఎల్ 2025 లో కనిపిస్తారు. ఈ టీ-20 లీగ్ కొత్త సీజన్ మార్చి 21 నుంచి ప్రారంభమవుతుంది. అయితే, ఈ సీజన్ గురించి అతిపెద్ద ప్రశ్న ఏమిటంటే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) కి ఎవరు కెప్టెన్ అవుతారు? ఆర్‌సీబీ కెప్టెన్ పేరు ఇంకా ఖరారు కాలేదు. విరాట్ కోహ్లీ మరోసారి ఆర్‌సీబీ సారథ్యం వహించవచ్చని చాలాసార్లు వార్తలు వచ్చాయి. మరోసారి అలాంటి వార్తలు ఊపందుకుంటున్నాయి. ఈ విషయంపై ఆర్‌సీబీ బృందం నుంచి కీలక ప్రకటన కూడా వచ్చింది.

కోహ్లీ మళ్ళీ ఆర్‌సిబి కెప్టెన్ అవుతాడా? అధికారికంగా ఇంకా ఏమీ చెప్పనప్పటికీ, కోహ్లీ మరోసారి RCBకి నాయకత్వం వహించగలడని అభిమానులు నమ్ముతున్నారు. ఫాఫ్ డు ప్లెసిస్ విడుదలైన తర్వాత, RCB తదుపరి కెప్టెన్ పేరు ఇంకా ప్రకటించలేదు. ఇంతలో, ఆర్‌సీబీ కెప్టెన్ ప్రశ్నపై ఆర్‌సీబీ సీఓఓ రాజేష్ మీనన్, 'ప్రస్తుతానికి మేం ఏం నిర్ణయించుకోలేదు' అంటూ చెప్పుకొచ్చాడు. అన్నారు. మా బృందంలో చాలా మంది నాయకులు ఉన్నారు. అలాంటి ఆటగాళ్ళు 4-5గురు ఉన్నారు. ఏమి చేయాలో ఇంకా చర్చ జరగలేదు. మేమంతా ఆలోచించి ఒక నిర్ణయానికి వస్తాం' అంటూ తెలిపాడు.

143 మ్యాచ్‌ల్లో ఆర్‌సిబికి నాయకత్వం: ఐపీఎల్ ప్రారంభమైనప్పటి నుంచి విరాట్ కోహ్లీ ఆర్‌సీబీతో అనుబంధం కలిగి ఉన్నాడు. అతను చాలా సంవత్సరాలు ఈ జట్టుకు నాయకత్వం వహించాడు. 2011లో, అతను మొదటిసారి జట్టుకు నాయకత్వం వహించాడు. అయితే, అతను 2013 సంవత్సరంలో పూర్తి సమయం కెప్టెన్ అయ్యాడు. అతను 2021 వరకు నిరంతరం RCB కెప్టెన్‌గా కొనసాగాడు. ఆ తరువాత అతను కెప్టెన్సీని విడిచిపెట్టాడు. తరువాత ఫాఫ్ డు ప్లెసిస్ జట్టును నడిపించాడు. ప్లెసిస్ లేకపోయినా, విరాట్ కొన్ని మ్యాచ్‌లకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఇప్పటివరకు కోహ్లీ 143 మ్యాచ్‌లకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు నాయకత్వం వహించాడు.

ఆర్‌సీబీకి ట్రోఫీ గెలిపించని కోహ్లీ: విరాట్ కోహ్లీ 143 మ్యాచ్‌ల్లో 70 ఓడిపోయి 66 మ్యాచ్‌ల్లో గెలిచాడు. అయితే, కోహ్లీ తన కెప్టెన్సీలో ఒక్కసారి కూడా ఆర్‌సీబీని ఛాంపియన్‌గా చేయలేకపోయాడు. కానీ, అతని కెప్టెన్సీలో, RCB 2016 లో ఫైనల్‌కు చేరుకుంది. కానీ, సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతిలో ఓడిపోయింది.