SRH vs RR IPL 2021 Records: పోటీలో ఇరు జట్లు సమమే.. నేడు హోరాహోరీ పోరు గ్యారెంటీ.. గత రికార్డులు ఎలా ఉన్నాయంటే?

|

Sep 27, 2021 | 2:40 PM

SRH Vs RR IPL 2021 Match Prediction, Head to Head Records: ఐపీఎల్ 2021 రెండో దశలో భాగంగా నేడు రాజస్థాన్ రాయల్స్‌తో సన్‌రైజర్స్‌ హైదరాబాద్ టీం తలపడనుంది. ఇప్పటి వరకు ఈ రెండు జట్లు 14 సార్లు తలపడ్డాయి.

1 / 5
ఐపీఎల్ 2021 లో ఈరోజు రాజస్థాన్ రాయల్స్ గెలుస్తుందా లేదా సన్‌రైజర్స్ హైదరాబాద్ గెలుస్తుందో చెప్పడం కష్టం. అయితే విజయం కోసం ఈ రెండు జట్ల మధ్య భీకర పోరాటం జరగడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ రెండు జట్ల మధ్య గతంలో జరిగిన మ్యాచ్‌ల్లో ఎవరి విజయాలు ఎలా ఉన్నాయో చూద్దాం.

2 / 5
ఐపీఎల్ 2021లో రెండవ దశలో నేడు రాజస్థాన్ రాయల్స్ టీంతో సన్‌రైజర్స్‌ హైదరాబాద్ టీం 15 వ సారి తలపడనున్నాయి. ఇంతకు ముందు ఆడిన 14 మ్యాచుల్లో రాజస్థాన్ రాయల్స్‌ టీం 7, సన్‌రైజర్స్ 7 విజయాలతో సమానంగా నిలిచాయి. ఐపీఎల్ 2021 లో తొలి దశలో రాజస్థాన్ గత పోటీలో హైదరాబాద్‌ను ఓడించింది. దీంతో ఆరెంజ్ ఆర్మీ ఈరోజు ప్రతీకారం తీర్చుకోవడానికి సిద్ధమైంది.

3 / 5
దుబాయ్‌లో ఈ రెండు జట్లు రెండుసార్లు తలపడ్డాయి. ఇందులో ఇరు జట్లు చెరో మ్యాచ్‌ గెలిచారు. అంటే ఈ రోజు పోటీ కూడా రసవత్తరంగా జరగనుందని తెలుస్తోంది. గత 5 మ్యాచ్‌లలో రాజస్థాన్ టీం 3 మ్యాచులు, హైదరాబాద్‌ టీం 2 మ్యాచుల్లో గెలిచింది.  ఈరోజు హైదరాబాద్ గెలిస్తే చెరో మూడు విజయాలతో సమనంగా ఉండనుంది.

4 / 5
రాజస్థాన్ రాయల్స్ ప్లేయింగ్ XI అంచనా : యశస్వి జైస్వాల్, లియామ్ లివింగ్‌స్టోన్, సంజు శాంసన్ (కీపర్, కెప్టెన్), డేవిడ్ మిల్లర్/ఎవిన్ లూయిస్, మహిపాల్ లొమ్రర్, రియాన్ పరాగ్, రాహుల్ తెవాటియా, తబరైజ్ షమ్సి/క్రిస్ మోరిస్, కార్తీక్ త్యాగి, చేతన్ సకారియా, ముస్తఫిజుర్ రహమాన్.

5 / 5
సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లేయింగ్ XI: డేవిడ్ వార్నర్/జాసన్ రాయ్, వృద్ధిమాన్ సాహా (కీపర్), కేన్ విలియమ్సన్ (కెప్టెన్), మనీష్ పాండే, కేదార్ జాదవ్/విరాట్ సింగ్/ప్రియం గార్గ్, జాసన్ హోల్డర్, అబ్దుల్ సమద్, రషీద్ ఖాన్, భువనేశ్వర్ కుమార్, సందీప్ శర్మ, ఖలీల్ అహ్మద్.