
విరాట్ కోహ్లీ వరల్డ్ క్రికెట్లో ఆల్ టైం ఫేవరేట్ వరల్డ్ క్లాస్ క్రికెట్ లో అత్యుత్తమ ప్లేయర్‌గా కొనసాగుతూ వున్నాడు .టీమిండియాకు దాదాపు దశాబ్ద కాలానికి పైగానే ప్రాతినిధ్యం వహిస్తున్న విరాట్ కోహ్లీ.. కీలక సమయాల్లో జట్టు ను విజయతీరాలకు చేర్చాడు.

భారత జట్టుకు కెప్టెన్ గా కూడా వ్యవహరించాడు ఈ స్టార్ క్రికెటర్. ఇక ప్రస్తుతం కెప్టెన్సీ నుంచి తప్పుకున్నప్పటికీ జట్టులో కీలక ప్లేయర్‌గా కొనసాగుతున్నాడు. తన కెరీర్ లో ఇప్పటికే ఎన్నో అరుదైన రికార్డులు సృష్టించాడు విరాట్ కోహ్లీ.

ఇక ఇప్పుడు ఏకంగా క్రికెట్ దేవుడిగా పిలుచుకునే సచిన్ రికార్డుకు చేరువలో వచ్చాడు. అదేంటంటే.. అత్యధిక విజయాల్లో భారత జట్టులో భాగస్వామ్యం వహించిన ఆటగాళ్లలో రెండో స్థానంలో నిలిచాడు విరాట్ కోహ్లీ.

307 మ్యాచ్ ల విజయాల్లో భాగస్వామ్యం వహించిన క్రికెటర్ గా ఫస్ట్ ప్లేస్ లో సచిన్ టెండూల్కర్ ఉన్నాడు. ఇటీవల వెస్టిండీస్‌తో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్లో విజయంతో కోహ్లీ 296 మ్యాచ్లలో భారత విషయంలో భాగస్వామ్యం వహించిన క్రికెటర్ గా సెకండ్ ప్లేస్‌కు చేరుకున్నాడు కోహ్లీ.

ఈ రికార్డ్ లో మహేంద్ర సింగ్ ధోని 295 మ్యాచ్లతో మూడో స్థానంలో ఉన్నాడు.ఇదే లిస్టులో 277 మ్యాచ్లతో రోహిత్ నాలుగో స్థానంలో ఉన్నాడు. 12 మ్యాచ్ లలో గెలుపులో భాగస్వామ్యం అయితే సచిన్ రికార్డును బద్దలు కొడతాడు విరాట్ కోహ్లీ.