Heaviest Bat: క్రికెట్ చరిత్రలో అత్యంత బరువైన బ్యాట్ ఎవరిదో తెలుసా..? టాప్ 5 ప్లేయర్ల లిస్టులో ముగ్గురు మనోళ్లే..

|

Aug 03, 2023 | 12:22 PM

Heaviest Cricket Bat: క్రికెట్‌లో ప్రతి పరుగుకీ విలువ ఉంటుంది. ఒక్కపరుగు తేడాతో మ్యాచ్ ఫలితం మారిపోయిన సందర్భాలు వందలో సంఖ్యలోనే ఉన్నాయి. అయితే బ్యాటర్ ఒక్క పరుగు చేయాలన్నా, బౌండరీ లేదా సిక్సర్ బాదాలన్నా అతని చేతిలోని బ్యాట్ తనకు అనుకూలమైనదిగా ఉండాలి. ఈ కారణంగానే కోహ్లీ సహా ఎందరో క్రికెటర్లు తేలికపాటి బ్యాట్లను వాడతారు. అయితే కొందరు ఇందుకు పూర్తి విరుద్దం. ఈ క్రమంలో అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక బరువున్న బ్యాట్లను ఉపయోగించిన టాప్ 5 ప్లేయర్లు ఎవరో ఇప్పుడు చూద్దాం..

1 / 5
సచిన్ టెండూల్కర్: క్రికెట్ చరిత్రలో అత్యంత బరువైన బ్యాట్‌తో ఆడిన ఆటగాడిగా 100 సెంచరీల సచిన్ టెండూల్కర్ అగ్రస్థానంలో ఉన్నాడు. సచిన్ ఒకానొక సమయంలో MRF-Adidas కంపెనీకి చెందిన 1.47 కిలోల బ్యాట్‌ను ఉపయోగించాడు.

2 / 5
క్రిస్ గేల్: యూనివర్సల్ బాస్, సిక్సర్ల సామ్రాట్, వెస్టిండీస్ క్రికెటర్ క్రిస్ గేల్ ఈ లిస్టులో రెండో స్థానంలో ఉన్నాడు. గేల్ కూడా ఒకానొక సమయంలో Spartan CG కంపెనీకి చెందిన 1.36 కిలోల బ్యాట్‌ని ఉపయోగించాడు.

3 / 5
వీరేంద్ర సెహ్వాగ్: టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ 2008లో దక్షిణాఫ్రికాపై 1.35 కిలోల SG బ్యాట్ ఉపయోగించి 319 పరుగులు చేశాడు.

4 / 5
ఎంఎస్ ధోని: కూల్ కెప్టెన్‌గా ప్రఖ్యాతి గాంచిన ఎంఎస్ ధోని 1.27 కిలోల Spartan బ్యాట్‌ను ఉపయోగించాడు.

5 / 5
డేవిడ్ వార్నర్: ప్రత్యర్థులను కంగారు పెట్టించే ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ కూడా ఈ లిస్టులో ఉన్నాడు. వార్నర్ మామ 1.24 కిలోల బ్యాట్‌ని ఉపయోగిస్తాడు.