Indoor Cricket Stadium: ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ఇకపై వర్షం కురిసినా టెన్షన్ వద్దు.. కొత్త క్రికెట్ స్టేడియం చూశారా?

|

Jul 09, 2024 | 4:59 PM

Australia: ఆస్ట్రేలియాలో కొత్త క్రికెట్ స్టేడియం నిర్మించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈసారి నిర్మించే స్టేడియం పైకప్పు ఉండడం విశేషం. అంటే గతంలో ఉన్న మెల్‌బోర్న్ డాక్‌లాండ్స్ స్టేడియం కంటే భిన్నంగా ఆల్-వెదర్ స్టేడియంను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

1 / 5
ప్రపంచంలోనే మొట్టమొదటి ఆల్-వెదర్ క్రికెట్ స్టేడియంను నిర్మించాలని ఆస్ట్రేలియా ప్రభుత్వం యోచిస్తోంది. ఈ స్టేడియం అతి ముఖ్యమైన లక్షణం పైకప్పుతో ఉండడమే. అదేంటంటే.. వర్షం కురిసినా మ్యాచ్‌ల నిర్వహణకు అనువుగా ఉండే ఇండోర్ క్రికెట్ స్టేడియం నిర్మాణాన్ని ఆస్ట్రేలియా ప్రారంభించింది.

2 / 5
గతంలో ఆస్ట్రేలియా ప్రభుత్వం మెల్‌బోర్న్‌లో మార్వెల్ స్టేడియంను నిర్మించింది. ఈ స్టేడియంలో పైకప్పు కూడా ఉంది. కానీ, ఈ రూఫింగ్ స్టేడియం మ్యాచ్‌ల కోసం నిర్మించలేదు. అలాగే ఇక్కడ క్రికెట్ మ్యాచ్ జరిగినప్పుడు చాలాసార్లు బంతి పైకప్పునకు తగిలేది. ఇప్పుడు ఈ మైదానాన్ని ఇతర క్రీడలకు ఉపయోగిస్తున్నారు.

3 / 5
క్రికెట్ మ్యాచ్‌లకు అనువుగా ఉండే ఆల్ వెదర్ క్రికెట్ స్టేడియాన్ని నిర్మించేందుకు ఆస్ట్రేలియా ప్రభుత్వం ముందుకు రావడం విశేషం. ఈ స్టేడియం డిజైన్‌లు ఇప్పుడు లీకయ్యాయి. పైకప్పు గోళాకార ఆకారంలో గాజుతో అందించారు. తద్వారా ఉదయం కూడా మ్యాచ్ నిర్వహించవచ్చు. అలాగే వర్షం కురుస్తున్నప్పటికీ మ్యాచ్ సజావుగా సాగనుంది.

4 / 5
స్టేడియం 23,000 సీట్ల సామర్థ్యం కలిగి ఉంటుంది. క్రికెట్ కాకుండా ఇతర క్రీడల కోసం ఉపయోగించేందుకు అనువుగా ఈ స్టేడియాన్ని డిజైన్ చేశారంట. దీని ద్వారా, ఆల్-వెదర్ క్రికెట్ స్టేడియంలో ఎల్లప్పుడూ క్రీడా కార్యకలాపాలు జరిగేలా ఆస్ట్రేలియా ప్రభుత్వం ఒక ప్రణాళికను రూపొందించింది.

5 / 5
దీని గురించి కాక్స్ ఆర్కిటెక్చర్ సీఈఓ అలిస్టర్ రిచర్డ్‌సన్ మాట్లాడుతూ.. అన్ని వేళలా క్రికెట్ ఆడేందుకు వీలుగా ఈ స్టేడియం డిజైన్ చేసినట్లు తెలిపారు. ముఖ్యంగా దాని పైకప్పు చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ కొత్త స్టేడియం నిర్మాణ పనులు త్వరలో ప్రారంభించి 2028 నాటికి ప్రారంభించనున్నామని తెలిపారు.