Tilak Varma: తి’లక్’ వర్మ సరికొత్త చరిత్ర.. టీ20 క్రికెట్‌లో తొలి ప్లేయర్‌గా తెలుగబ్బాయి

|

Jan 26, 2025 | 2:59 PM

Tilak Varma Records: ఇంగ్లండ్‌తో జరిగిన 2వ టీ20 మ్యాచ్‌లో టీమిండియా 2 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంలో యువ లెఫ్టార్మ్ బ్యాట్స్‌మెన్ తిలక్ వర్మ విజేతగా నిలిచాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 165 పరుగులు చేయగా, టీమిండియా 19.2 ఓవర్లలో 166 పరుగులకే ఆలౌటైంది. ఈ విజయంతో తిలక్ వర్మ ప్రత్యేక రికార్డు సృష్టించాడు.

1 / 5
టీ20 క్రికెట్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా తిలక్ వర్మ రికార్డు సృష్టించాడు. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో ఇంగ్లండ్‌తో జరుగుతున్న 2వ మ్యాచ్‌లో తిలక్ వర్మ 55 బంతుల్లో 5 సిక్సర్లు, 4 ఫోర్లతో అజేయంగా 72 పరుగులు చేశాడు.

2 / 5
ఈ 72 పరుగులతో టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో తొలి వికెట్ పడిన అనంతరం బరిలోకి దిగిన తర్వాత అజేయంగా అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా తిలక్ వర్మ ప్రపంచ రికార్డును సొంతం చేసుకున్నాడు. ఇంతకు ముందు, ఈ అరుదైన ప్రపంచ రికార్డు న్యూజిలాండ్‌కు చెందిన మార్క్ చాప్‌మన్ పేరిట ఉంది.

3 / 5
2023లో, మార్క్ చాప్‌మన్ 271 పరుగులు (65*, 16*, 71*, 104*, 15) చేశాడు. మరో మాటలో చెప్పాలంటే తొలి వికెట్ పడిన తర్వాత బరిలోకి దిగి టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన రికార్డును మార్క్ చాప్‌మన్ లిఖించాడన్నమాట.

4 / 5
ఇప్పుడు ఈ అజేయ పరుగుల రికార్డును తిలక్ వర్మ తన ఖాతాలో వేసుకున్నాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్‌లో రెండు అజేయ సెంచరీలు (120*, 107*) సాధించిన తిలక్ వర్మ, ఇంగ్లండ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో అజేయంగా 19* పరుగులు, రెండో మ్యాచ్‌లో అజేయంగా 72* పరుగులు చేశాడు.

5 / 5
దీంతో టీ20 క్రికెట్‌లో తొలి వికెట్ పడిన తర్వాత బరిలోకి వచ్చిన తిలక్ వర్మ 318* పరుగులు చేసి సరికొత్త చరిత్ర సృష్టించాడు. విశేషమేమిటంటే.. తిలక్ గత 4 ఇన్నింగ్స్‌ల్లో ఔట్‌ కాకపోవడం. కాబట్టి, ఈ రికార్డు తదుపరి మ్యాచ్‌లోనూ కొనసాగుతుంది. టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో తిలక్ వర్మ ఇలా ఎన్ని పరుగులు చేస్తాడో వేచి చూడాల్సిందే.