బిగ్‌ బాష్ లీగ్‌లో టీమిండియా ఉమెన్స్.. బంపర్ ఆఫర్లతో పోటీపడుతోన్న బీబీఎల్ టీంలు..!

|

Jul 09, 2021 | 12:16 PM

Big Bash League: ఆస్ట్రేలియా ఉమెన్స్ బిగ్ బాష్ లీగ్ షెడ్యూల్ విడుదలైంది. ఈ టోర్నమెంట్ అక్టోబర్ నుంచి నవంబర్ వరకు జరుగనుంది. బిగ్ బాష్ లీగ్ లో భారత ఉమెన్స్‌ ప్లేయర్స్‌కు చాలా డిమాండ్ ఉంటుంది.

1 / 5
ఆస్ట్రేలియా ఉమెన్స్ బిగ్ బాష్ లీగ్ షెడ్యూల్ విడుదలైంది. ఈ టోర్నమెంట్ అక్టోబర్ నుంచి నవంబర్ వరకు జరుగనుంది. బిగ్ బాష్ లీగ్ లో భారత ఉమెన్స్‌ ప్లేయర్స్‌కు చాలా డిమాండ్ ఉంటుంది. ఈమేరకు అన్ని జట్లు భారత ప్లేయర్లను తీసుకునేందుకు పోటీపడుతున్నాయి. ఈ టోర్నమెంట్‌కు ముందు భారత మహిళా క్రికెట్ జట్టు ఆస్ట్రేలియాలో పర్యటించనుంది. సెప్టెంబర్ నుంచి అక్టోబర్ వరకు మూడు వన్డేలు, మూడు టీ 20 లు, ఒక పింక్ బాల్ టెస్ట్ కోసం ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్తున్నారు. బిగ్ బాష్‌ లీగ్‌కు టీమిండియా ఉమెన్స్ అందుబాటులో ఉండనున్నారు.

2 / 5
ప్రపంచంలోనే నంబర్ వన్ టీ 20 బ్యాటర్  భారత యువ సంచలనం షెఫాలీ వర్మను తీసుకునేందుకు అన్ని జట్లు పోటీ పడుతున్నాయి. అయితే సిడ్నీ సిక్సర్స్ జట్టు షెఫాలీపై కన్నేసినట్లు వార్తలు వస్తున్నాయి. షెఫాలితో ఒప్పందాన్ని ఖరారు చేసేందుకు రెడీ అయినట్లు తెలుస్తోంది. ఈమేరకు త్వరలోనే ఓ ప్రకటన రానుంది. షెఫాలీతో పాటు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ రాధా యాదవ్ కూడా సిడ్నీ సిక్సర్స్‌లో చేరేందుకు సన్నాహాలు చేస్తుంది. వీరిద్దరూ ఈ ఆస్ట్రేలియా లీగ్‌లో తొలిసారి ఆడనున్నారు. సిడ్నీ సిక్సర్స్ జట్టు మేనేజర్, ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ లిసా స్టాలేకర్ మాట్లాడుతూ, షెఫాలి అందరి జాబితాలో ఉన్నారని, ప్రస్తుతం ఆమె అద్భుతంగా రాణిస్తోందని పేర్కొంది.

3 / 5
భారత మహిళల టీ 20 జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, స్మృతి మంధనా, దీప్తి శర్మ, జెమిమా రోడ్రిగ్స్, పూనమ్ యాదవ్‌లు కూడా బిగ్ బాష్ లీగ్‌లో ఆడనున్నారు. ఈమేరకు పలు టీంలు ఇప్పటికే ఆటగాళ్లతో సంప్రదింపులు చేస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఓ ప్రకటన రావొచ్చు.

4 / 5
బిగ్ బాష్ లీగ్ సందర్భంగా భారత మహిళా క్రీడాకారులకు డిమాండ్ ఉండటానికి ప్రధాన కారణం ఒకటి ఉంది. పాకిస్తాన్, ఇంగ్లండ్ ప్లేయర్లు అందుబాటులో ఉండకపోవడమే. ఆ టైంలో ఇరు దేశాల మధ్య మ్యాచులు ఉన్నాయి. ఇంగ్లాండ్ మహిళా ప్లేయర్లు బిగ్ బాష్ లీగ్‌లో ఆడలేరు. దీంతో భారత మహిళలకు డిమాండ్ బాగా పెరిగిందని తెలుస్తోంది. అప్పటికే టీమిండియా ఉమెన్స్ ఆసీస్ పర్యటనలో ఉంటారని, అందుకే అన్ని జట్లు టీమిండియా ప్లేయర్ల కోసం పోటీ పడుతున్నాయని లిసా స్టాలేకర్ అభిప్రాయపడ్డారు. ఈ టోర్నమెంట్‌కు విదేశీ ఆటగాళ్లు అందుబాటులో ఉంటారని క్రికెట్ ఆస్ట్రేలియాకు చెందిన బిగ్ బాష్ హెడ్ అలిస్టర్ డాబ్సన్ పేర్కొన్నారు.

5 / 5
భారత మహిళా క్రికెటర్లలో కొంతమంది ఇప్పటికే బిగ్ బాష్ లీగ్‌లో ఆడారు. వీరిలో స్మృతి మంధన, హర్మన్‌ప్రీత్ కౌర్, వేద కృష్ణమూర్తి ఉన్నారు. వేద కృష్ణమూర్తి 2017 లో హోబర్ట్ హరికేన్స్ తరఫున ఆడగా, స్మృతి మంధనా 2016 లో బ్రిస్బేన్ హీట్, 2018 లో హోబర్ట్ హరికేన్స్ తరఫున ఆడింది. ఈ టోర్నమెంట్‌లో ఆడిన తొలి భారత మహిళా క్రికెటర్ హర్మన్‌ప్రీత్ కౌర్. ఆమె 2016, 2017 లో సిడ్నీ థండర్ టీం తరపున బరిలోకి దిగింది.