IND vs BAN: 14 నెలలు.. 3 మ్యాచ్‌లు, 178 పరుగులు, 0 సెంచరీలు.. కట్‌చేస్తే.. కలగానే వంద సెంచరీలు

|

Sep 20, 2024 | 3:55 PM

India vs Bangladesh 1st Test: 14 నెలల తర్వాత టెస్టు క్రికెట్‌లోకి పునరాగమనం చేసిన స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ భారీ ఫ్లాప్‌ అయ్యాడు. దీంతో కోట్లాది మంది భారత ప్రజల గుండెలు బద్దలయ్యయాయి. చెన్నైలో జరుగుతున్న భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ తొలి టెస్టు మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో విరాట్ కోహ్లీ 6 బంతుల్లో 6 పరుగులు చేసి ఔటయ్యాడు. ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ రూట్ టెస్ట్ క్రికెట్‌లో పరుగులు, సెంచరీలు చేస్తున్న విధానాన్ని దృష్టిలో ఉంచుకుని, విరాట్ కోహ్లీ భారీ సెంచరీతో దంచికొడతాడని భారత అభిమానులు ఆశించారు.

IND vs BAN: 14 నెలలు.. 3 మ్యాచ్‌లు, 178 పరుగులు, 0 సెంచరీలు.. కట్‌చేస్తే.. కలగానే వంద సెంచరీలు
క్రికెట్ నిపుణులు సచిన్ టెండూల్కర్ సెంచరీల రికార్డును బద్దలు కొట్టడానికి టీమ్ ఇండియా ఏస్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీని తరచుగా పోటీదారుగా పిలుస్తుంటారు. విరాట్ కోహ్లీ ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్‌లో 80 సెంచరీలతో పాటు సచిన్ టెండూల్కర్ ప్రపంచ రికార్డును బద్దలు కొట్టడానికి 21 సెంచరీల దూరంలో ఉన్నాడు. విరాట్ కోహ్లీకి 35 ఏళ్లు నిండాయి.
Follow us on