Virat Kohli: విరాట్ కోహ్లీ @ 1000.. కాన్పూర్‌లో రికార్డుల మోత మోగించిన రన్ మెషీన్..

|

Oct 02, 2024 | 7:23 AM

Virat Kohli Records: బంగ్లాదేశ్‌తో జరుగుతున్న 2వ టెస్టు మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ మొత్తం 76 పరుగులు చేశాడు. ఈ 76 పరుగులతో కింగ్ కోహ్లీ రెండు రికార్డులను లిఖించాడు. అందులో ఒకటి ప్రపంచ రికార్డు. ఆ రికార్డుల పూర్తి వివరాలు ఓసారి చూద్దాం..

1 / 5
బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ 8 ఫోర్లు కొట్టి ప్రత్యేక రికార్డు జాబితాలో చేరాడు. ఈ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో కోహ్లీ 35 బంతులు ఎదుర్కొని 4 ఫోర్లు, 1 సిక్స్‌తో 47 పరుగులు చేశాడు. రెండో ఇన్నింగ్స్‌లో 37 బంతుల్లో 4 ఫోర్లతో 29 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.

2 / 5
ఈ ఎనిమిది ఫోర్లతో విరాట్ కోహ్లీ టెస్టు క్రికెట్‌లో 1000 ఫోర్లు బాదిన సాధకుల జాబితాలో చేరిపోయాడు. దీంతో ఈ ఘనత సాధించిన 6వ భారత బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. ఇంతకు ముందు సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్, వీరేంద్ర సెహ్వాగ్, వీవీఎస్ లక్ష్మణ్, సునీల్ గవాస్కర్ ఈ ఘనత సాధించారు.

3 / 5
ఈ జాబితాలో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ అగ్రస్థానంలో ఉన్నాడు. టీమిండియా తరపున 200 టెస్టు మ్యాచ్‌లు ఆడిన సచిన్ 329 ఇన్నింగ్స్‌ల్లో 2058 ఫోర్లు బాది ప్రపంచ రికార్డు సృష్టించాడు.

4 / 5
115 టెస్టుల్లో 195 ఇన్నింగ్స్‌లు పూర్తి చేసిన విరాట్ కోహ్లీ మొత్తం 1001 ఫోర్లు కొట్టాడు. దీంతో టెస్టు క్రికెట్ చరిత్రలో 1000 ఫోర్లు బాదిన ప్రపంచ 26వ ఆటగాడిగా నిలిచాడు.

5 / 5
అలాగే, ఈ మ్యాచ్‌లో మొత్తం 76 పరుగులు చేయడం ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లో 27 వేల పరుగులు పూర్తి చేసుకున్నాడు. దీంతో క్రికెట్ చరిత్రలో అత్యంత వేగంగా 27 వేల పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. గతంలో ఈ రికార్డు సచిన్ టెండూల్కర్ (623) పేరిట ఉండేది. ఇప్పుడు విరాట్ కోహ్లీ కేవలం 594 ఇన్నింగ్స్‌లలో 27000 పరుగులు సాధించి సరికొత్త చరిత్ర సృష్టించాడు.