
Border Gavaskar Trophy: బోర్డర్-గవాస్కర్ టెస్టు సిరీస్‌లో రెండో మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. అడిలైడ్‌లోని ఓవల్ మైదానంలో శుక్రవారం (డిసెంబర్ 6) నుంచి ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌కు ముందే విరాట్ కోహ్లీ ఆస్ట్రేలియా బౌలర్లకు దడపుట్టిస్తున్నాడు.

ఎందుకంటే, అడిలైడ్‌లో అత్యుత్తమ ప్రదర్శన చేసిన అత్యుత్తమ విదేశీ బ్యాట్స్‌మెన్‌లలో విరాట్ కోహ్లీ ఒకరు. ఓవల్ మైదానంలో కింగ్ కోహ్లీకి ఇప్పటికే 3 సెంచరీల రికార్డు ఉంది. హాఫ్ సెంచరీ కూడా చేశాడు.

2012 అడిలైడ్ టెస్ట్ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శన చేశాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో 6వ స్థానంలో బరిలోకి దిగిన కోహ్లి 213 బంతుల్లో 116 పరుగులు చేశాడు.

2014లో అడిలైడ్ టెస్టు మ్యాచ్‌లో విరాట్ రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ సెంచరీ సాధించాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో 115 పరుగులు చేసిన కింగ్ కోహ్లీ రెండో ఇన్నింగ్స్‌లో 141 పరుగులు చేశాడు.

2021లో అడిలైడ్‌లో జరిగిన డే-నైట్ టెస్ట్ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో విరాట్ కోహ్లీ 74 పరుగులు చేశాడు. దీంతో అడిలైడ్‌లో ఆడిన అన్ని మ్యాచ్‌ల్లో 50+ పరుగులు చేసిన విరాట్ కోహ్లీ ప్రత్యేక రికార్డును సొంతం చేసుకున్నాడు.

అంతే కాకుండా, అడిలైడ్ ఓవల్‌లో ఆడిన 15 ఇన్నింగ్స్‌ల్లో 73.61 సగటుతో 957 పరుగులు చేశాడు. అందుకే, కింగ్ కోహ్లీ అద్భుత ఫామ్ ఇప్పుడు ఆస్ట్రేలియా బౌలర్లను ఆందోళనకు గురిచేస్తోంది. ముఖ్యంగా పెర్త్ టెస్టులో సెంచరీ బాదిన కింగ్ కోహ్లి.. ఓవల్ మైదానంలో సెంచరీ చేయడంపై అంచనాలు నెలకొన్నాయి.