
Venkatesh Iyer weds Shruti Raghunathan: కోల్‌కతా నైట్ రైడర్స్ తరపున ఆడుతున్న ఆల్ రౌండర్ వెంకటేష్ అయ్యర్ తన వ్యక్తిగత జీవితంలో మరో ముందడుగు వేశాడు. త్వరలో పెళ్లిపీటలు ఎక్కనున్నాడు. ఈ మేరకు అయ్యర్ నిశ్చితార్థం జరిగినట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు.

ఈ కేకేఆర్ ఆల్ రౌండర్ శ్రుతి రఘునాథన్‌తో నిశ్చితార్థం చేసుకున్నాడు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఫొటోలను పంచుకున్నాడు. ఇంతకీ శ్రుతి రఘునాథన్ ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.

వెంకటేష్ అయ్యర్ కాబోయే భార్య పేరు శ్రుతి రఘునాథన్. ఆమె గురించి సమాచారం పెద్దగా అందుబాటులో లేదు. మీడియా నివేదికల ప్రకారం, ఆమె PSG కాలేజ్ ఆఫ్ ఆర్ట్ అండ్ సైన్స్ నుంచి B.Com చేసినట్లు తెలుస్తోంది.

ఆ తర్వాత ఆమె నిఫ్ట్ ఇండియా నుంచి ఫ్యాషన్ మేనేజ్‌మెంట్‌లో మాస్టర్స్ డిగ్రీని పొందింది. శృతి ప్రస్తుతం బెంగళూరులోని లైఫ్‌స్టైల్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్‌లో మర్చండైజ్ ప్లానర్‌గా పని చేస్తోంది.

వెంకటేష్ అయ్యర్ గురించి మాట్లాడితే, ఈ లెఫ్ట్ హ్యాండర్ భారతదేశం తరపున అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు. అయితే, గత రెండేళ్లుగా జట్టుకు దూరంగా ఉన్నాడు. ఐపీఎల్‌లో KKR కోసం నిరంతరం ఆడుతూనే ఉన్నాడు. కాగా, 2023 IPLలో KKRలో భాగమయ్యాడు.