T20 World Cup 2024: టీమిండియా తదుపరి మ్యాచ్‌లు ఎప్పుడు, ఎవరితోనంటే? పూర్తి షెడ్యూల్ ఇదిగో

|

Jun 11, 2024 | 7:31 AM

T20 World Cup 2024: టీ20 ప్రపంచకప్ 2024లో టీమ్ ఇండియా మెరుగైన ప్రదర్శనను కొనసాగిస్తోంది. తొలి మ్యాచ్‌లో ఐర్లాండ్‌పై 8 వికెట్ల తేడాతో గెలుపొందిన భారత జట్టు, రెండో మ్యాచ్‌లో పాక్ జట్టుపై విజయం సాధించింది. వచ్చే రెండు మ్యాచ్‌ల్లో ఒకటి గెలిస్తే టీమిండియా సూపర్-8 దశకు చేరుకుంటుంది

1 / 6
T20 World Cup 2024: టీ20 ప్రపంచకప్ 2024లో టీమ్ ఇండియా మెరుగైన ప్రదర్శనను కొనసాగిస్తోంది. తొలి మ్యాచ్‌లో ఐర్లాండ్‌పై 8 వికెట్ల తేడాతో గెలుపొందిన భారత జట్టు, రెండో మ్యాచ్‌లో పాక్ జట్టుపై విజయం సాధించింది. వచ్చే రెండు మ్యాచ్‌ల్లో ఒకటి గెలిస్తే టీమిండియా సూపర్-8 దశకు చేరుకుంటుంది.

2 / 6
అంటే గ్రూప్-ఎ పాయింట్ల పట్టికలో మొదటి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు తదుపరి దశకు అర్హత సాధిస్తాయి. దీని ప్రకారం, ఇప్పుడు భారత జట్టు అగ్రస్థానంలో ఉండగా, USA జట్టు రెండవ స్థానంలో ఉంది.

3 / 6
న్యూయార్క్‌లోని నసావు స్టేడియం వేదికగా పాకిస్థాన్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో టీమిండియా బౌలర్లు అద్భుత ప్రదర్శన చేశారు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు 119 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఆ తర్వాత పాక్‌ను 113 పరుగులకే కట్టడి చేయడంలో భారత బౌలర్లు సఫలమయ్యారు. దీంతో టీమిండియా 6 పరుగుల తేడాతో ఉత్కంఠ విజయం సాధించింది. ఇక భారత్ తదుపరి మ్యాచ్‌ల విషయానికి వస్తే..

4 / 6
 జూన్ 12 (బుధవారం) భారత్ వర్సెస్ అమెరికా: టీ20 ప్రపంచకప్‌లో భారత్-అమెరికా జట్ల మధ్య జూన్ 12న న్యూయార్క్‌లోని నసావు స్టేడియంలో మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ రాత్రి 8 గంటలకు ప్రారంభం కానుంది.

5 / 6
జూన్ 15 (శనివారం) భారత్ వర్సెస్ కెనడా: అమెరికాలోని లాడర్‌హిల్‌లోని సెంట్రల్ బ్రోవార్డ్ పార్క్ స్టేడియం వేదికగా జరగనున్న టీ20 ప్రపంచకప్ 33వ మ్యాచ్‌లో భారత్, కెనడా తలపడనున్నాయి. భారతీయ కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది.

6 / 6
భారత టీ20 ప్రపంచకప్ జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), యస్సావి జైస్వాల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, సంజు శాంసన్, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్, అర్ష్దీప్ సింగ్ , మహ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా.|| రిజర్వ్‌లు: శుభమన్ గిల్, అవేష్ ఖాన్, రింకూ సింగ్, ఖలీల్ అహ్మద్.