Venkata Chari |
Oct 18, 2022 | 5:57 PM
2007 నుంచి టీ20 ప్రపంచకప్‌లో భారత్ తరపున అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగా ఆర్ అశ్విన్ నిలిచాడు. ఈ లిస్టులో టాప్ జాబితాలో టీమిండియా మాజీలు కూడా ఉన్నారు. టాప్ 5 జాబితాను ఓసారి పరిశీలిద్దాం..
టీ20 ప్రపంచకప్‌లో భారత్ తరపున అత్యంత విజయవంతమైన బౌలర్‌గా ఆర్ అశ్విన్ నిలిచాడు. 18 మ్యాచ్‌లు ఆడి 26 వికెట్లు తీశాడు. ఈ సమయంలో అతని బౌలింగ్ సగటు 15.26, ఎకానమీ రేటు 6.01గా నిలిచింది.
టీ20 ప్రపంచకప్‌లో భారత్ తరపున అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా రవీంద్ర జడేజా నిలిచాడు. జడేజా 22 మ్యాచ్‌లలో 25.19 బౌలింగ్ సగటు, 7.14 ఎకానమీ రేటుతో 21 వికెట్లు పడగొట్టాడు.
ఈ జాబితాలో మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ మూడో స్థానంలో నిలిచాడు. ఇర్ఫాన్ 15 మ్యాచుల్లో 16 వికెట్లు తీశాడు. ఈ సమయంలో పఠాన్ బౌలింగ్ సగటు 20.06, ఎకానమీ రేటు 7.46గా నిలిచింది.
ఇర్ఫాన్ పఠాన్‌తో పాటు మాజీ వెటరన్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ కూడా లిస్టులో ఉన్నాడు. 16 వికెట్లు పడగొట్టాడు. హర్భజన్ తన కెరీర్‌లో 19 టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌లు ఆడాడు. ఇందులో అతను 29.25 సగటు, 6.78 ఎకానమీ రేటుతో బౌలింగ్ చేశాడు.
ఇక్కడ టాప్-5లో మాజీ ఫాస్ట్ బౌలర్ ఆశిష్ నెహ్రా కూడా ఉన్నాడు. నెహ్రా కేవలం 10 మ్యాచ్‌ల్లోనే 15 వికెట్లు పడగొట్టాడు. అతను T20 ప్రపంచ కప్‌లో 17.93 సగటు, 6.89 ఎకానమీ రేటుతో బౌలింగ్ చేశాడు.