Sri Lanka: మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు.. లంక క్రికెటర్‌పై ఐసీసీ నిషేధం..

|

Aug 09, 2024 | 8:34 PM

Praveen Jayawickrama: శ్రీలంక స్పిన్నర్ ప్రవీణ్ జయవిక్రమ అవినీతి నిరోధక కోడ్‌ను ఉల్లంఘించారని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఆరోపించింది. అంతర్జాతీయ క్రికెట్, 2021 లంక ప్రీమియర్ లీగ్‌తో సహా మూడు వేర్వేరు కోడ్‌లను ఉల్లంఘించినట్లు 25 ఏళ్ల జయవిక్రమపై ICC అభియోగాలు మోపింది.

1 / 6
తాజాగా శ్రీలంకలో టీమిండియా పర్యటన ముగిసింది. ఈ పర్యటనలో ఇరు జట్ల మధ్య 3 టీ20లు, 3 వన్డేల సిరీస్ జరిగింది. టీ20 సిరీస్‌ను టీమిండియా కైవసం చేసుకోగా, వన్డే సిరీస్‌లో 27 ఏళ్ల తర్వాత భారత్‌ను ఓడించి శ్రీలంక చారిత్రాత్మక ఫీట్ సాధించింది.

2 / 6
అయితే, ఈ సంతోషకరమైన తరుణంలో శ్రీలంక జట్టుకు ఓ షాకింగ్ న్యూస్ వచ్చింది. ఒక జట్టు ఆటగాడు మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు ఎదుర్కొన్నాడు. ఇప్పుడు ఆ ఆరోపణలపై స్పందించడానికి ఆటగాడికి అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ సమయం ఇచ్చింది.

3 / 6
శ్రీలంక స్పిన్నర్ ప్రవీణ్ జయవిక్రమ అవినీతి నిరోధక నియమావళిని ఉల్లంఘించారని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఆరోపించింది. అంతర్జాతీయ క్రికెట్, 2021 లంక ప్రీమియర్ లీగ్‌తో సహా మూడు వేర్వేరు కోడ్‌లను ఉల్లంఘించినట్లు 25 ఏళ్ల జయవిక్రమపై ICC అభియోగాలు మోపింది.

4 / 6
ఆర్టికల్ 2.4.4, ఆర్టికల్ 2.4.7 ప్రకారం ప్రవీణ్ జయవిక్రమపై ICC అభియోగాలు మోపింది. తనపై వచ్చిన ఆరోపణలకు సమాధానం చెప్పేందుకు ప్రవీణ్ జయవిక్రమకు రెండు వారాల గడువు ఇచ్చారు. అంటే, ఆగస్టు 6 నుంచి ఆగస్టు 20లోగా జయవిక్రమ ఈ ఆరోపణలకు సమాధానం చెప్పాల్సి ఉంటుంది.

5 / 6
వాస్తవానికి, 2021 లంక ప్రీమియర్ లీగ్ సమయంలో ఫిక్సింగ్ కోసం మరొక ఆటగాడిని సంప్రదించమని ప్రవీణ్ జయవిక్రమను కోరినట్లు ఆరోపణలు వచ్చాయి. అయితే, దీనిపై జయవిక్రమ అవినీతి నిరోధక శాఖకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. అంతే కాకుండా అవినీతి నిరోధక శాఖ విచారణను కూడా అడ్డుకోవడంతో ఐసీసీ ఈ చర్య తీసుకుంది.

6 / 6
ప్రవీణ్ జయవిక్రమ శ్రీలంక తరపున మూడు ఫార్మాట్లలో ఆడాడు. ఇప్పటి వరకు 5 టెస్టులు, 5 వన్డేలు, 5 టీ20 ఇంటర్నేషనల్స్ ఆడాడు. టెస్టుల్లో 25, వన్డేల్లో 5, టీ20ల్లో 2 వికెట్లు తీశాడు. ప్రవీణ్ జయవిక్రమ భారత్‌తో 4 మ్యాచ్‌లు ఆడి 10 వికెట్లు పడగొట్టాడు.