IPL 2025: రూ. 75 కోట్లతో ఐదుగురు.. హైదరాబాద్‌ రిటైన్ లిస్ట్ ఇదే.. కెప్టెన్‌గా ఎవరంటే?

IPL 2025 Retention: ఐపీఎల్ 2025 రాబోయే సీజన్ కోసం సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ మొత్తం ఐదుగురు ఆటగాళ్లను ఉంచుకుంది. అది కూడా రూ.75 కోట్లతో ఈ లిస్ట్‌ను సిద్ధం చేసుకుంది. అంటే SRH ఫ్రాంచైజీ మొత్తం వేలం మొత్తం ఇప్పటికే రూ.120 కోట్ల నుంచి రూ.75 కోట్లకు పెరిగింది.

Venkata Chari

|

Updated on: Oct 31, 2024 | 10:38 AM

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2025) 18వ ఎడిషన్‌కు ముందు ఐదుగురు ఆటగాళ్లను జట్టులో ఉంచుకోవాలని సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ నిర్ణయించింది. ఈ ఐదుగురు ఆటగాళ్ల కోసం SRH ఫ్రాంచైజీ మొత్తం రూ.75 కోట్లు వెచ్చించింది. దీని ప్రకారం సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టులో కొనసాగే ఆటగాళ్ల జాబితా ఎలా ఉందో ఓసారి చూద్దాం..

1 / 6
పాట్ కమిన్స్: సన్‌రైజర్స్ హైదరాబాద్ 2వ స్థానంలో పాట్ కమిన్స్‌ను చేర్చింది. ఆస్ట్రేలియన్ ఆల్ రౌండర్‌ను SRH ఫ్రాంచైజీ 18 కోట్ల రూపాయలకు తన వద్ద ఉంచుకోనుంది. అందువల్ల వచ్చే సీజన్‌లోనూ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు కమిన్స్ నాయకత్వం వహించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.

2 / 6
హెన్రిక్ క్లాసెన్: దక్షిణాఫ్రికా వికెట్ కీపర్-బ్యాట్స్‌మెన్ హెన్రిక్ క్లాసెన్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ మొదటి రిటైనర్‌గా ఉంచుకునే ఛాన్స్ ఉంది. ఇందుకోసం క్లాసెన్‌కు ఇచ్చే మొత్తం రూ.23 కోట్లుగా ఉండనుంది.

3 / 6
అభిషేక్ శర్మ: SRH ఫ్రాంచైజీ యువ లెఫ్టార్మ్ ఓపెనర్ అభిషేక్ శర్మను కూడా జట్టులో ఉంచుకోనున్నట్లు తెలుస్తోంది. రూ.14 కోట్లకు అభిషేక్ శర్మను సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ కొనసాగించే ఛాన్స్ ఉంది.

4 / 6
ట్రావిస్ హెడ్: సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ ట్రావిస్ హెడ్‌ను రూ.14 కోట్లకు రిటైన్ చేసుకోనుంది. అందువల్ల, IPL తదుపరి సీజన్‌లో కూడా SRH కోసం హెడ్-అభిషేక్ జోడి ఇన్నింగ్స్‌ను ప్రారంభిస్తుందని ఎదురు చూడొచ్చు.

5 / 6
నితీష్ కుమార్ రెడ్డి: యువ ఆల్ రౌండర్ నితీష్ కుమార్ రెడ్డిని సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ 6 కోట్ల రూపాయలకు ఉంచుకుంది. దీని ద్వారా SRH ఫ్రాంచైజీ హైదరాబాద్ ఆటగాడిని తదుపరి సీజన్‌కు కూడా జట్టులో కొనసాగించాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

6 / 6
Follow us