
7. శుభ్మన్ గిల్: బుధవారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో న్యూజిలాండ్‌తో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో సెంచరీ చేసిన శుభమాన్ గిల్.. భారత్ తరఫున ఈ ఘనత సాధించిన 7వ ఆటగాడిగా నిలిచాడు.

వన్డే క్రికెట్‌లో డబుల్ సెంచరీ చేసిన ప్రపంచంలోనే అతి పిన్న వయస్కుడైన బ్యాట్స్‌మెన్‌గా గిల్ నిలిచాడు. కేవలం 23 ఏళ్ల 132 రోజుల వయసులో ఈ అద్భుతాన్ని చేశాడు. గత నెలలో 24 ఏళ్ల 145 రోజుల వయసులో ఈ రికార్డును నెలకొల్పిన ఇషాన్ కిషన్ రికార్డును బద్దలు కొట్టాడు.

ఇదొక్కటే కాదు, న్యూజిలాండ్‌పై వన్డేలో అతిపెద్ద ఇన్నింగ్స్ ఆడిన బ్యాట్స్‌మెన్‌గా శుభ్‌మన్ గిల్ నిలిచాడు. ఈ లిస్టులో 23 ఏళ్ల క్రితం హైదరాబాద్‌లోనే 1999లో అజేయంగా 186 పరుగులు చేసిన గ్రేట్ బ్యాట్స్‌మెన్ సచిన్ టెండూల్కర్ రికార్డును గిల్ బద్దలు కొట్టాడు.

గిల్ తన ఇన్నింగ్స్‌లో 9 సిక్సర్లు బాదేశాడు. ఇది వన్డే కెరీర్‌లో ఏ ఇన్నింగ్స్‌లోనూ అత్యధిక సిక్సర్లుగా మార్చేసుకున్నాడు.

ఈ క్రమంలోనే శుభమాన్ గిల్ తాజాగా మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కూడా అవతరించాడు.