SL vs PAK 1st Test: రిఎంట్రీ మ్యాచ్‌లోనే ‘సెంచరీ’ రికార్డ్.. వరుస వికెట్లతో లంకేయులపై విజృంభించిన పాక్ బౌలర్..

|

Jul 16, 2023 | 4:40 PM

SL vs PAK 1st Test: పాకిస్తాన్ క్రికెట్ జట్టు ప్రస్తుతం రెండు టెస్టుల సిరీస్ కోసం శ్రీలంకలో పర్యటిస్తుంది. అందులో భాగంగానే తొలి టెస్టు ఆదివారం ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌ ద్వారా‌.. గాయంతో ఎంతో కాలంగా క్రికెట్‌కి దూరమై టీమ్‌లోకి వచ్చిన షాహీన్ అఫ్రిది సెంచరీ నమోదు చేశాడు. అదెలా అంటే..

1 / 6
శ్రీలంక, పాకిస్థాన్ మధ్య గలే వేదికగా తొలి టెస్ట్ మ్యాచ్‌ ఆదివారం ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో పాక్ ఫాస్ట్ బౌలర్ షాహీన్ ఆప్రిదీ తన 100 టెస్ట్ వికెట్‌ని తీసుకున్నాడు. అలాగే ప్రస్తుతానికి మొత్తంగా 102 టెస్ట్ వికెట్లను పడగొట్టాడు. అలాగే పాక్ తరఫున ఈ ఘనత సాధించిన 18వ ప్లేయర్‌గా అవతరించాడు.

2 / 6
టాస్ గెలిచిన శ్రీలంక ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో లంక ఓపెనర్ నిషాన్ మధుశంకను 4 పరుగుల వద్ద అవుట్ చేయడం ద్వారా ఆఫ్రిది తన వికెట్ల సెంచరీని పూర్తి చేసుకున్నాడు. అలాగే దిముత్ కరుణరత్నే(29), కుశాల్ మెండీస్(12)ను కూడా వరుసగా పెవిలియన్ చేర్చడం ద్వారా ఆఫ్రిదీ మొత్తం 102 టెస్టు వికెట్లను పడగొట్టాడు.

3 / 6
ఈ మ్యాచ్‌కు ముందు, ఆఫ్రిది తన సెంచరీ వికెట్లను పూర్తి చేసేందుకు కేవలం ఒక వికెట్ దూరంలోనే ఉన్నాడు. కానీ ఈ వికెట్ దక్కించుకోవడానికి అతను ఏడాది పాటు వేచి చూడాల్సి వచ్చింది. అదెలా అంటే.. అఫ్రిదీ గతేడాది జులైలో శ్రీలంకతో ఇదే మైదానంలో తన చివరి టెస్టు మ్యాచ్ ఆడాడు. అయితే ఆ మ్యాచ్‌లో మోకాలి గాయంతో చాలా కాలం క్రికెట్‌కు దూరమయ్యాడు.

4 / 6
గతేడాది సరిగ్గా ఇదే రోజున అంటే జూలై 16, 2022న ప్రారంభమైన అప్పటి మ్యాచ్‌లో మహిష్ తీక్షణను 99వ వికెట్‌గా అవుట్ చేశాడు ఆఫ్రిది. అయితే రెండో ఇన్నింగ్స్‌లో కేవలం 7 ఓవర్లే వేసి, ఆపై గాయం పాలయ్యాడు. దీంతో అఫ్రిది జాతీయ జట్టు నుంచి సుదీర్ఘ కాలం పాటు తప్పుకోవాల్సి వచ్చింది.

5 / 6
ఈ గాయం కారణంగానే గతేడాది ఆసియా కప్‌లో కూడా అఫ్రిదీ ఆడలేకపోయాడు. ఆ తర్వాత టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌ తరఫున ఆడినా.. ఫైనల్ మ్యాచ్‌లో మళ్లీ గాయపడ్డాడు. ఫలితంగా స్వదేశంలోనే ఇంగ్లండ్, న్యూజిలాండ్‌లతో టెస్టు సిరీస్‌లు జరిగినా అందులో అతను ఆడలేకపోయాడు.

6 / 6
అనంతరం మోకాలి గాయం నుంచి కోలుకున్న ఆఫ్రిదీ పాకిస్థాన్ సూపర్ లీగ్‌లో ఆడాడు. అతని నాయకత్వంలోనే లాహోర్ ఖలందర్స్ జట్టు పీఎస్ఎల్ 2023 టైటిల్‌ను కూడా గెలుచుకుంది. ఆ తర్వాత ఏప్రిల్-మేలో న్యూజిలాండ్‌తో జరిగిన ODI, T20 సిరీస్‌ల కోసం ఆఫ్రిదీ జాతీయ జట్టులో చేరాడు.