
Matt Henry Ruled Out: ఆదివారం దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో భారత్‌తో జరుగుతోన్న ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ టాస్‌కు ముందు న్యూజిలాండ్‌కు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది.

బుధవారం దక్షిణాఫ్రికాతో జరిగిన సెమీఫైనల్లో క్యాచ్ తీసుకుంటూ భుజం గాయం కారణంగా కివీస్ ప్రధాన పేసర్ మాట్ హెన్రీ ఫైనల్ పోరు నుంచి తప్పుకున్నాడు. అతని స్థానంలో నాథన్ స్మిత్‌ను ప్లేయింగ్ XI జట్టులోకి తీసుకున్నారు.

లాహోర్‌లో దక్షిణాఫ్రికా 363 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో హెన్రీ క్యాచ్ తీసుకొని హెన్రిచ్ క్లాసెన్‌ను అవుట్ చేశాడు. కానీ, ఆ ప్రయత్నంలో ఇబ్బంది పడ్డాడు. అతను మైదానం నుంచి వెళ్లిపోయాడు. కానీ, తన ఏడు ఓవర్ల వ్యవధిలో మరో రెండు ఓవర్లు బౌలింగ్ చేయడానికి తిరిగి వచ్చాడు.

50 ఓవర్ల టోర్నమెంట్‌లో న్యూజిలాండ్ టైటిల్ ఆశలకు హెన్రీ కీలకం. బ్లాక్ క్యాప్స్ ఓడిపోయిన గ్రూప్ మ్యాచ్‌లో భారత్‌పై 42 పరుగులకు ఐదు వికెట్లు తీసుకున్నాడు.

ఈ కుడిచేతి వాటం పేసర్ ప్రస్తుతం టోర్నమెంట్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా ఉన్నాడు. నాలుగు మ్యాచ్‌ల్లో 16.70 సగటుతో 10 వికెట్లు పడగొట్టాడు.