MS Dhoni: స్పెల్లింగ్ మిస్టేక్ నుంచి గోడలపై పోస్టర్ల వరకు.. ధోని లైఫ్‌లో ఎవ్వరికీ తెలియని 5 సీక్రెట్స్ ఇవే..!

Updated on: Jul 07, 2026 | 9:25 AM

MS Dhoni Unknown Facts: మహేంద్ర సింగ్ ధోనీ అనగానే మనకు గుర్తొచ్చేది ఆయన హెలికాప్టర్ షాట్లు, ఐసీసీ ట్రోఫీలు, మైదానంలో చూపించే ప్రశాంతత. అయితే, రాంచీకి చెందిన ఒక సాధారణ యువకుడు ‘గ్లోబల్ ఐకాన్’గా ఎదిగే క్రమంలో క్రికెట్ అభిమానులకు కూడా పెద్దగా తెలియని కొన్ని ఆసక్తికరమైన, ఆశ్చర్యపరిచే నిజాలు ఆయన జీవితంలో ఉన్నాయి. అవేంటో ఓసారి చూద్దాం..!

1 / 6
ఇంటిపేరు వెనుక ఒక ‘స్పెల్లింగ్ మిస్టేక్’..!: ధోనీ కుటుంబం అసలు పేరు ‘ధోనీ’ కాదు..! వారి అసలు ఇంటిపేరు "ధౌనీ" (Dhauni). మహి పాఠశాలలో చేరే సమయంలో సర్టిఫికెట్లలో జరిగిన ఒక చిన్న స్పెల్లింగ్ పొరపాటు వల్ల అది ‘ధోనీ’ (Dhoni) గా మారిపోయింది. ఆ తర్వాత ఆ తప్పును సరిదిద్దడానికి కుటుంబ సభ్యులు ఎన్ని ప్రయత్నాలు చేసినా అది కుదరలేదు. అలా ఒక స్పెల్లింగ్ మిస్టేక్ వల్ల ప్రపంచం మొత్తం మెచ్చే ఒక బ్రాండ్ నేమ్ పుట్టుకొచ్చింది.

2 / 6
సచిన్ పోస్టర్లతో నిండిన గోడలు..: ధోనీ చిన్నప్పుడు క్రికెట్ ఆడటం ప్రారంభించింది గాడ్ ఆఫ్ క్రికెట్ సచిన్ టెండూల్కర్‌ను చూసే. బాల్యంలో సచిన్ అంటే మహికి ఎంత పిచ్చి అంటే, తన గది గోడల నిండా సచిన్ టెండూల్కర్ పోస్టర్లనే అంటించుకునేవాడు. సచిన్ లాగే తాను కూడా మైదానంలో భారీ సిక్సర్లు బాదాలని కలలు కనేవాడు. ఆ తర్వాత అదే సచిన్‌తో కలిసి ఆడటమే కాకుండా, ఆయన సమక్షంలోనే ప్రపంచకప్ గెలవడం ధోనీ జీవితంలో ఒక మధురమైన మలుపు.

3 / 6
పొడవాటి జుట్టు వెనుక అసలు ‘ఇన్స్పిరేషన్’ ఎవరంటే?: కెరీర్ ఆరంభంలో ధోనీ పొడవాటి జుట్టుతో వినూత్నమైన హెయిర్ స్టైల్‌తో కనిపించి సంచలనం సృష్టించారు. పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ సైతం ధోనీ జుట్టును మెచ్చుకుంటూ ‘హెయిర్ కట్ చేసుకోవద్దు’ అని సలహా ఇచ్చారు. అయితే, ఈ హెయిర్ స్టైల్ వెనుక అసలు ప్రేరణ బాలీవుడ్ నటుడు జాన్ అబ్రహం. ఆ సమయంలో జాన్ అబ్రహం స్టైల్‌ను చూసే ధోనీ తన జుట్టును అలా పెంచారు.

4 / 6
లక్ నమ్మి జెర్సీ నంబర్ ‘7’ ఎంచుకోలేదు..: ధోనీ జెర్సీ నంబర్ 7 కు ప్రపంచవ్యాప్తంగా ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సోషల్ మీడియాలో ‘థాలా ఫర్ ఎ రీజన్’ (Thala for a reason) మీమ్స్ కూడా దీనిపైనే వస్తుంటాయి. అయితే ధోనీ ఈ నంబర్‌ను ఏదో అదృష్టం (Luck) కలిసి వస్తుందని ఎంచుకోలేదు. ఆయన పుట్టిన తేదీ జూలై 7 (ఏడో నెలలోని ఏడో తారీఖు). అందుకే కేవలం తన పుట్టినరోజుకు గుర్తుగా ఆ నంబర్‌ను ఎంపిక చేసుకున్నారు. ఒకసారి ప్రయాణంలో ఒకరు జెర్సీ నంబర్ మార్చితే ఇంకా సక్సెస్ అవుతారని సలహా ఇస్తే.. "నాకు నా జెర్సీ నంబర్ అంటే ఇష్టం, కేవలం అదృష్టం మీదే ఆధారపడటం నాకు ఇష్టం లేదు" అని మహి తేల్చి చెప్పారు.

5 / 6
మొదటి సంపాదనతో కొన్నది ‘సెకండ్ హ్యాండ్’ బైకే..: ధోనీకి బైక్‌లంటే ఎంత పిచ్చో అందరికీ తెలిసిందే. ఆయన గ్యారేజీలో వందలాది ఖరీదైన, వింటేజ్ బైక్‌లు ఉన్నాయి. కానీ, ధోనీ తన జీవితంలో మొదటిసారి క్రికెట్ ఇంటర్న్‌షిప్ ద్వారా సంపాదించిన డబ్బుతో కొనుగోలు చేసింది ఒక సెకండ్ హ్యాండ్ బైక్. ఆ పాత బైక్ నుంచే నేడు ప్రపంచంలోని అత్యంత ఖరీదైన బైక్‌లను సొంతం చేసుకునే స్థాయికి ఆయన ఎదిగారు.

6 / 6
సెలెక్టర్లను ఆశ్చర్యపరిచిన వ్యూహం: 2004లో మొదటిసారి సెలెక్షన్ కమిటీ చైర్మన్ కిరణ్ మోరే ధోనీని దులీప్ ట్రోఫీ మ్యాచ్‌లో చూశారు. ధోనీ సాంప్రదాయ క్రికెట్ కీపింగ్ శైలికి భిన్నంగా, వినూత్నమైన టెక్నిక్‌తో కీపింగ్ చేస్తూ, మెరుపు బ్యాటింగ్‌తో సెలెక్టర్ల మనసు దోచుకుని టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చారు.

Follow Us