
క్రికెట్ ఫార్మాట్‌తో సంబంధం లేకుండా, ఒక రోజు ఒక స్టార్ ఆటగాడు క్రికెట్‌కు వీడ్కోలు చెప్పే సమయం వస్తుంది. ఇది అభిమానులకు చాలా బాధ కలిగించవచ్చు. ఈ IPL 2024 సీజన్ తర్వాత కూడా కొంతమంది ఆటగాళ్లు క్రికెట్ కు గుడ్ బై చెప్పే అవకాశముంది. అంటే IPL 2025లో వీరు ఇక ఆడకపోవచ్చు.

లక్నో సూపర్ జెయింట్స్ వెటరన్ స్పిన్నర్ అమిత్ మిశ్రా వయసు 41 ఏళ్లు. వచ్చే ఏడాదికి 42 ఏళ్లు నిండుతాయి. ఈ సీజన్‌లో మిశ్రా పెద్దగా మ్యాచ్ లు ఆడింది లేదు. దీంతో పాటు అతనికి ఫిట్‌నెస్ సమస్య లు కూడా ఉన్నాయి. వయసు పెరగడంతో పాటు ఫిట్‌నెస్ సమస్యల కారణంగా, వచ్చే ఏడాది అంటే IPL 2025 సీజన్‌లో మిశ్రా ఆడే అవకాశం చాలా తక్కువ.

ఈ జాబితాలో ఢిల్లీ క్యాపిటల్స్ వెటరన్ ఫాస్ట్ బౌలర్ ఇషాంత్ శర్మ కూడా ఉన్నాడు. ప్రస్తుతం శర్మ వయసు 35. వచ్చే ఏడాదికి 36 ఏళ్లు నిండుతాయి. ఇషాంత్ శర్మ లో ఫిట్‌నెస్ సమస్యలు కూడా కనిపిస్తున్నాయి. అంతే కాకుండా ఫాస్ట్ బౌలర్ కూడా. 36 ఏళ్ల వయసులో ఫాస్ట్ బౌలింగ్ చేయడం చాలా కష్టమైన పని. మరి ఇషాంత్ శర్మ వచ్చే ఏడాది ఐపీఎల్ ఆడతాడో లేదో చూద్దాం.

చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి 42 ఏళ్లు కాగా, వచ్చే నెలలో 43వ ఏట అడుగుపెట్టనున్నాడు. ఇప్పటికే తన రిటైర్మెంట్ పై ధోని హింట్స్ ఇస్తూనే ఉన్నాడు. దీనికి తోడు ఆయన కాలికి కూడా శస్త్రచికిత్స కూడా జరిగింది. కాబట్టి మిస్టర్ కూల్ కు ఇదే ఆఖరి ఐపీఎల్ సీజన్ అని చెప్పుకోవచ్చు.

గుజరాత్ టైటాన్స్ వికెట్ కీపర్ అండ్ బ్యాటర్ వృద్ధిమాన్ సాహా వయసు 39 ఏళ్లు. వచ్చే ఏడాదికి 40 ఏళ్లు నిండుతాయి. ఇప్పటికే టీం ఇండియా కు దూరమైన సాహా వచ్చే ఏడాది ఐపీఎల్‌లో ఆడే అవకాశం లేదు.

దినేష్ కార్తీక్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వికెట్ కీపర్ అండ్ బ్యాటర్. మైదానంలో డీకే చాలా ఫిట్‌గా కనిపిస్తున్నాడు కానీ అతని వయస్సు 38. వచ్చే ఏడాది అతనికి 39 సంవత్సరాలు. కాబట్టి భవిష్యత్ అవసరాల దృష్య్టా ఏ జట్టు కూడా అతనిపై ఆసక్తి చూపించకపోవచ్చు.