- Telugu News Photo Gallery Cricket photos Mohammad siraj take 4 wickets career best bowling india vs new zealand 3rd t20i
IND vs NZ: 4 ఓవర్లలో 4 వికెట్లు.. కెరీర్‌లోనే బెస్ట్ ఫిగర్స్.. నేపియర్‌లో అదరగొట్టిన హైదరాబాదీ పేసర్..
Mohammad Siraj: నేపియర్స్ పిచ్‌పై భారత బౌలర్ల దెబ్బకు న్యూజిలాండ్ బ్యాటర్లు క్రీజులో నిలదొక్కుకోలేకపోయారు. ఈ మ్యాచ్‌లో మహ్మద్ సిరాజ్ 3 వికెట్లు తీసి తన సత్తా నిరూపించుకున్నాడు.
Updated on: Nov 22, 2022 | 4:40 PM

న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో నేపియర్‌లో భారత ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ ప్రత్యేక ప్రదర్శన కనిపించింది. ఈ రైట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ మూడో టీ20లో 4 ఓవర్లలో కేవలం 17 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు.

నేపియర్ టీ20లో మహ్మద్ సిరాజ్ మార్క్ చాప్‌మన్, గ్లెన్ ఫిలిప్స్, జేమ్స్ నీషమ్, మిచెల్ సాంట్‌నర్‌ల ముఖ్యమైన వికెట్లు తీశాడు. సిరాజ్ ఆటతీరుతో కివీస్ జట్టు భారీ స్కోరును అందుకోలేకపోయింది.

మహ్మద్ సిరాజ్ కేవలం 8 బంతుల్లో 3 వికెట్లు పడగొట్టాడు. 16వ ఓవర్ ఐదో బంతికి క్రీజులో ఉన్న సెట్ బ్యాట్స్‌మెన్ ఫిలిప్స్ ముఖ్యమైన వికెట్‌ను సిరాజ్ పడగొట్టాడు. ఆ తర్వాత, తన చివరి ఓవర్లో, అతను జేమ్స్ నీషమ్, సాంట్నర్ వికెట్లను తీసుకున్నాడు.

టి20 ఇంటర్నేషనల్‌లో మహ్మద్ సిరాజ్ అత్యుత్తమ ప్రదర్శన ఇదే కావడం విశేషం. అంతకుముందు, సిరాజ్ 24 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. అయితే నేపియర్‌లో సిరాజ్ తన అత్యుత్తమ ప్రదర్శనను కనబరిచాడు.

ఈ రైట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ 19వ ఓవర్లో తన ఫీల్డింగ్ మ్యాజిక్ కూడా చూపించాడు. పాయింట్ వద్ద ఫీల్డింగ్ చేస్తూ ఆడమ్ మిల్నేని కూడా రనౌట్ చేశాడు. అంటే సిరాజ్ మ్యాచ్‌లో మొత్తం 5 మందిని బలితీసుకున్నాడు.




