
Kolkata Knight Riders vs Lucknow Super Giants: ఐపీఎల్ 2024 సీజన్ లో కోల్ కతా నైట్ రైడర్స్ జోరు కొనసాగుతోంది. తాజాగా ఈడెన్ గార్డెన్ మైదానం వేదికగా ఆదివారం (ఏప్రిల్ 14) జరిగిన మ్యాచ్ లో లక్నోను చిత్తు చేసింది.

లక్నో విధించిన 162 పరుగుల లక్ష్యాన్ని 15.4 ఓవర్లలోనే కేవలం 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది కోల్‌కతా. ఓపెనర్ ఫిలిప్ సాల్ట్ ( 47 బంతుల్లో89 నాటౌట్, 14 ఫోర్లు, 3 సిక్సర్లు)చెలరేగి ఆడాడు.

శ్రేయస్ అయ్యర్ (38 బంతుల్లో 38, 6ఫోర్లు) కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడడంతో కోల్‌కతా నైట్ రైడర్స్ ఎనిమిది వికెట్ల తేడాతో లక్నో సూపర్‌జెయింట్‌పై విజయం సాధించింది.

అంతకు ముందు లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 161 పరుగులు మాత్రమే చేయగలిగింది. నికోలస్ పూరన్ 45 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు.

ఈ విజయంతో కోల్‌కతా నైట్ రైడర్స్ 8 పాయింట్లతో పాయింట్ల పట్టికలో రెండో స్థానాన్ని నిలబెట్టుకుంది. అదే సమయంలో ఓటమితో లక్నో సూపర్ జెయింట్స్ పాయింట్ల పట్టికలో నాలుగో స్థానం నుంచి ఐదో స్థానానికి పడిపోయింది.