10 మ్యాచ్‌ల్లో 9 ఓటమి.. కట్‌చేస్తే.. వన్డే ప్రపంచకప్ నుంచి ఛోటా ప్యాకెట్‌తోపాటు మరో ఇద్దరు ఔట్?

Updated on: Jul 20, 2026 | 4:38 PM

Team India Squad Changes: యూకే పర్యటన ముగిసిన నేపథ్యంలో టీమిండియా యాజమాన్యం తీవ్ర ఆలోచనలో పడింది. 2027 ప్రపంచకప్ టోర్నీ కోసం బలమైన జట్టును నిర్మించాలంటే ఫామ్‌లో లేని, జట్టు అవసరాలకు సరిపోని ఆటగాళ్లపై కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పదు. శివమ్ దూబే, ఇషాన్ కిషన్, గుర్నూర్ బ్రార్‌ల భవిష్యత్తు ఇప్పుడు సెలెక్టర్ల నిర్ణయంపైనే ఆధారపడి ఉంది.

1 / 5
యూకే పర్యటనలో భారత క్రికెట్ జట్టు ఘోర పరాజయం అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. పది మ్యాచ్‌ల్లో కేవలం ఒక్క విజయం మాత్రమే సాధించడం టీమిండియా ప్రదర్శనపై అనేక అనుమానాలను రేకెత్తిస్తోంది. ముఖ్యంగా 2027 వన్డే ప్రపంచకప్ సమీపిస్తున్న తరుణంలో, కొంతమంది ఆటగాళ్ల పేలవ ప్రదర్శన యాజమాన్యానికి పెద్ద సవాలుగా మారింది. రాబోయే రోజుల్లో వేటు పడే అవకాశం ఉన్న ఆ ముగ్గురు ఆటగాళ్లు ఎవరో చూద్దాం.

2 / 5
యూకే పర్యటనలో నిరాశపరిచిన టీమిండియా..: ఇంగ్లాండ్, ఐర్లాండ్ పర్యటనల్లో భారత్ ఆధిపత్యం చెలాయిస్తుందని అంతా భావించారు. కానీ మైదానంలో పరిస్థితి పూర్తిగా భిన్నంగా మారింది. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, శ్రేయస్ అయ్యర్ మినహా మిగిలిన ప్రధాన బ్యాటర్లు ఎవరూ రాణించలేకపోయారు. బౌలింగ్ విభాగంలోనూ క్రమశిక్షణ లోపించడంతో ఆతిథ్య జట్టు సులభంగా ఆధిపత్యం చెలాయించింది. చరిత్రలో అత్యంత బలంగా భావించే వన్డే ఫార్మాట్‌లోనూ భారత్ 1-2 తేడాతో సిరీస్ కోల్పోవడం చేదు నిజం. ఈ పరాజయం తర్వాత 2027 ప్రపంచకప్ రేసు నుంచి కొందరిని తప్పించేందుకు బీసీసీఐ సిద్ధమవుతోంది.

3 / 5
1. శివమ్ దూబే: నిరూపించుకోవడంలో వైఫల్యం..: నితీష్ కుమార్ రెడ్డి గాయపడటంతో ఆల్ రౌండర్ స్థానంలో శివమ్ దూబేకు వన్డే జట్టులో అవకాశం దక్కింది. అయితే తనకు లభించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడంలో తీవ్రంగా విఫలమయ్యాడు. దూబేకు ఇచ్చిన ఏకైక వన్డేలో డకౌట్ కావడమే కాకుండా, బౌలింగ్‌లో కేవలం 6 ఓవర్లు మాత్రమే వేయగలిగాడు. కెప్టెన్ కూడా దుబే బౌలింగ్‌పై పెద్దగా నమ్మకం ఉంచలేదు. హార్దిక్ పాండ్యా, నితీష్ రెడ్డి కోలుకుని జట్టులోకి తిరిగొస్తే దూబేకు చోటు దక్కడం దాదాపు అసాధ్యం. వన్డే ఫార్మాట్‌కు దుబే తాత్కాలిక ప్రత్యామ్నాయంగానే మిగిలిపోయేలా ఉన్నాడు.

4 / 5
2. ఇషాన్ కిషన్: బౌన్స్ ట్రాక్‌లపై సాంకేతిక లోపాలు..: వన్డేల్లో ఇషాన్ కిషన్‌కు మంచి సగటు ఉన్నప్పటికీ, ఇంగ్లాండ్ సిరీస్‌లో ఆయన బ్యాటింగ్ వైఫల్యం బయటపడింది. ఆసియా, వెస్టిండీస్ వికెట్లపై రాణించిన కిషన్, ఇంగ్లాండ్ వేగవంతమైన, స్వింగ్ బౌలింగ్ ముందు నిలవలేకపోయాడు. రెండు ఇన్నింగ్స్‌లలో కలిపి కిషన్ చేసింది కేవలం 15 పరుగులు మాత్రమే. ఆయన సగటు 7.50 కాగా, స్ట్రైక్ రేట్ 75గా నమోదైంది. 2027 ప్రపంచకప్ దక్షిణాఫ్రికాలోని అధిక బౌన్స్ ఉండే పిచ్‌లపై జరగనుంది. ఇంగ్లాండ్ బౌలర్లు సంధించిన బౌన్సర్లను ఎదుర్కోవడంలో కిషన్ ఇబ్బంది పడటం చూస్తే, అటువంటి పిచ్‌లపై ఆయన సాంకేతికత సరిపోదని స్పష్టమవుతోంది.

5 / 5
3. గుర్నూర్ బ్రార్: యువ బౌలర్ గుర్నూర్ బ్రార్‌కు ఈ సిరీస్ ఒక చేదు అనుభవాన్ని మిగిల్చింది. ఇంగ్లాండ్ బ్యాటర్లు ఆయన బౌలింగ్‌ను సులభంగా ఎదుర్కొంటూ విరుచుకుపడ్డారు. మూడు వన్డేల్లో 4 వికెట్లు తీసినప్పటికీ, 7.76 ఎకానమీ రేటుతో పరుగులు సమర్పించుకోవడం తీవ్ర ఆందోళనకరం. మూడో వన్డేలో అత్యధిక పరుగులు ఇచ్చిన భారత బౌలర్లలో ఒకడిగా నిలిచాడు. జస్ప్రీత్ బుమ్రా, హర్షిత్ రాణా, ప్రసిద్ధ్ కృష్ణ, మహమ్మద్ సిరాజ్ వంటి నాణ్యమైన పేసర్లు అందుబాటులో ఉన్న వేళ, గుర్నూర్ బ్రార్‌ను ప్రపంచకప్ ప్రణాళికల నుంచి తప్పించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

Follow Us