- Telugu News Photo Gallery Cricket photos IPL Costliest Player Sam Curran becomes most expensive bowler for England as he gives 98 runs in 9.5 overs vs West Indies
ENG vs WI: ఐపీఎల్ కాస్ట్లీ ప్లేయర్‌కు ఘోర పరాభవం.. కేవలం 9.5 ఓవర్లతో చెత్త రికార్డులో చోటు..
England vs West Indies: భారీ స్కోరును ఛేదించిన వెస్టిండీస్ కెప్టెన్ షాయ్ హోప్ (109) భారీ సెంచరీతో మెరిశాడు. ఫలితంగా వెస్టిండీస్ జట్టు 48.5 ఓవర్లలో 326 పరుగులు చేసి 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. అయితే, ఇంగ్లండ్ బౌలర్, ఐపీఎల్‌లో అత్యంత ఖరీదైన ప్లేయర్‌గా పేరుగాంచిన శామ్ కరణ్ పేరిట మాత్రం చెత్త రికార్డ్ నమోదైంది.
Updated on: Dec 05, 2023 | 1:14 PM

ఇంగ్లండ్‌తో జరిగిన తొలి వన్డేలో వెస్టిండీస్ జట్టు 4 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 50 ఓవర్లలో 325 పరుగులు చేసి ఆలౌటైంది.

ఈ భారీ స్కోరును ఛేదించిన వెస్టిండీస్ టీం తరపున కెప్టెన్ షాయ్ హోప్ (109) అద్భుత సెంచరీతో మెరిశాడు. ఫలితంగా వెస్టిండీస్ జట్టు 48.5 ఓవర్లలో 326 పరుగులు చేసి 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

వెస్టిండీస్ బ్యాట్స్‌మెన్ చెలరేగితే.. శామ్ కుర్రాన్ ఇంగ్లండ్‌కు ఖరీదుగా మారాడు. 9.5 ఓవర్లు వేసిన కరణ్ 98 పరుగులు ఇచ్చి పేలవమైన రికార్డును అందుకున్నాడు.

మరో మాటలో చెప్పాలంటే, వన్డే క్రికెట్ చరిత్రలో ఇంగ్లండ్ తరపున అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్‌గా సామ్ కరణ్ పేలవమైన రికార్డును సొంతం చేసుకున్నాడు. ఇంతకు ముందు ఈ చెత్త రికార్డు స్టీవ్ హర్మిసన్ పేరిట ఉండేది.

2006లో లీడ్స్‌లో శ్రీలంకపై స్టీవ్ హర్మిసన్ 10 ఓవర్లలో 97 పరుగులు ఇచ్చాడు. 9.5 ఓవర్లలో 98 పరుగులు చేసి సామ్ కరణ్ ఇప్పుడు పేలవమైన రికార్డును కలిగి ఉన్నాడు.





























