IPL 2024: గుజరాత్ జట్టులోకి టీమిండియా నయా సెన్సెషన్.. వేలంలో వద్దన్నోళ్లే రా రమ్మంటున్నారుగా..

|

Mar 17, 2024 | 8:45 PM

Sarfaraz Khan May Join Gujarat Titans: టీమిండియా తరపున తొలి టెస్టు మ్యాచ్‌లో సంచలనం సృష్టించిన సర్ఫరాజ్ ఖాన్ ఇప్పుడు ఐపీఎల్ 17వ ఎడిషన్‌లో గుజరాత్ టైటాన్స్ తరపున ఆడనున్నాడని సమాచారం. నిజానికి ఐపీఎల్ మినీ వేలంలో ఏ జట్టు కూడా సర్ఫరాజ్‌ను కొనుగోలు చేయలేదు. అతను గుజరాత్ తరపున ఆడే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.

1 / 6

2 / 6
2023 ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ తరపున ఆడిన సర్ఫరాజ్‌ను 2024 వేలానికి ముందు ఢిల్లీ ఫ్రాంచైజీ విడుదల చేసింది. అయితే, ఇప్పుడు గుజరాత్ టైటాన్స్ జట్టులో సర్ఫరాజ్ ఖాన్ సబ్‌స్టిట్యూట్ ప్లేయర్‌గా చేరనున్నాడు.

3 / 6
మినీ వేలంలో రూ.3.6 కోట్లకు కొనుగోలు చేసిన భారత యువ వికెట్ కీపర్ కం బ్యాట్స్‌మెన్ రాబిన్ మింజ్ కొద్ది రోజుల క్రితం బైక్ ప్రమాదానికి గురయ్యాడు. ప్రమాదంలో అతనికి పెద్దగా గాయాలు కాలేదని సమాచారం.

4 / 6
కాబట్టి, ఐపీఎల్ ప్రారంభానికి ముందే రాబిన్ గుజరాత్ జట్టులోకి వస్తాడని చెప్పుకొచ్చారు. అయితే, నిన్న రాబిన్ అందుబాటుపై మాట్లాడిన జట్టు ప్రధాన కోచ్ ఆశిష్ నెహ్రా.. రాబిన్ మింజ్ లీగ్ మొత్తం నుంచి ఔట్ అయ్యాడని చెప్పుకొచ్చాడు.

5 / 6
ఇప్పుడు రాబిన్ మింజ్ గైర్హాజరీని భర్తీ చేయాలని చూస్తున్న గుజరాత్ ఫ్రాంచైజీ అతని స్థానంలో సర్ఫరాజ్ ఖాన్‌పై దృష్టి సారిస్తోంది. మరోవైపు, సర్ఫరాజ్ ఖాన్ కూడా ఐపీఎల్ 2024 కోసం పిలుపు కోసం ఎదురుచూస్తున్నాడు. వేలంలో అమ్ముడుపోని తర్వాత కూడా సర్ఫరాజ్ ఖాన్ ఐపీఎల్‌లో ఆడాలనే ఆశ వదులుకోలేదు.

6 / 6
ఇటీవలే ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో సర్ఫరాజ్‌ఖాన్‌కు టీమిండియా అరంగేట్రం చేసే అవకాశం లభించింది. ఈ సిరీస్‌లో సర్ఫరాజ్ ఆటతీరు అద్భుతంగా ఉంది. సర్ఫరాజ్ తన అరంగేట్రం టెస్టులో రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ అర్ధశతకాలు సాధించాడు.