IPL 2024: వామ్మో.. పంజాబోళ్ల దెబ్బకు హైదరాబాద్ రికార్డ్‌ బ్రేక్.. ఈడెన్‌లో ఇదేం సునామీ భయ్యా..

|

Apr 27, 2024 | 8:41 AM

IPL 2024: ఐపీఎల్ 2024 (IPL 2024) 42వ మ్యాచ్ ఉత్కంఠభరితమైన పోరుకు సాక్షిగా నిలిచింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‌కతా నైట్ రైడర్స్ 20 ఓవర్లలో 261 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని 18.4 బంతుల్లోనే ఛేదించిన పంజాబ్ కింగ్స్ టీమ్ టీ20 క్రికెట్‌లో సరికొత్త చరిత్ర సృష్టించింది.

1 / 5
కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ మైదానంలో జరిగిన ఐపీఎల్ (IPL 2024) 42వ మ్యాచ్ ద్వారా పంజాబ్ కింగ్స్ టీ20 క్రికెట్‌లో కొత్త చరిత్ర సృష్టించింది. ఈ మ్యాచ్‌లో కేకేఆర్‌ నిర్దేశించిన 262 పరుగుల లక్ష్యాన్ని పంజాబ్‌ కింగ్స్‌ 8 వికెట్ల తేడాతో ఛేదించింది.

2 / 5
ఈ చారిత్రాత్మక ఛేజింగ్‌లో, పంజాబ్ కింగ్స్ బ్యాటర్లు వరుసగా 24 సిక్సర్లు కొట్టారు. దీంతో పాటు ఐపీఎల్ చరిత్రలో ఒకే ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన జట్టుగా పంజాబ్ కింగ్స్ రికార్డు సృష్టించింది.

3 / 5
గతంలో ఈ రికార్డు సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు పేరిట ఉండేది. ఆర్సీబీతో జరిగిన ఈ ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఒకే ఇన్నింగ్స్‌లో 22 సిక్సర్లు కొట్టి సరికొత్త చరిత్ర సృష్టించింది.

4 / 5
ఇప్పుడు ఈ రికార్డును 24 సిక్సర్లతో బద్దలు కొట్టడంలో పంజాబ్ కింగ్స్ జట్టు విజయం సాధించింది. పంజాబ్ తరపున ఓపెనర్ ప్రభసిమ్రాన్ సింగ్ 5 సిక్సర్లు బాదగా, జానీ బెయిర్‌స్టో 9 సిక్సర్లు బాదాడు. రిలే రోసో 2, శశాంక్ సింగ్ 8 సిక్స్‌లు ఈ చారిత్రక రికార్డును లిఖించారు.

5 / 5
టీ20 క్రికెట్‌లో ఒకే ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన ప్రపంచ రికార్డు నేపాల్ జట్టు పేరిట ఉంది. మంగోలియాతో జరిగిన మ్యాచ్‌లో నేపాల్ జట్టు మొత్తం 26 సిక్సర్లు కొట్టి ఈ ప్రపంచ రికార్డు సృష్టించింది. ఇప్పుడు 24 సిక్సర్లతో పంజాబ్ కింగ్స్ ఈ జాబితాలో రెండో స్థానానికి చేరుకుంది.