RCB vs CSK: 18న బెంగళూరులో భారీ వర్షం.. చెన్నై, ఆర్సీబీ మ్యాచ్ రద్దయితే.. ప్లే ఆఫ్‌కు వెళ్లే జట్టు ఏదో తెలుసా?

|

May 15, 2024 | 10:00 PM

IPL 2024 Playoffs: ప్రస్తుతం IPL 2024లో, అభిమానుల కళ్ళు RCB వర్సెస్ CSK మధ్య జరగబోయే మ్యాచ్‌పై మాత్రమే ఉన్నాయి. ఈ మ్యాచ్ కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇరు జట్ల మధ్య జరిగే ఈ మ్యాచ్ క్వార్టర్ ఫైనల్ లాగా ఉండడమే ఇందుకు కారణం. అంటే, ఈ మ్యాచ్‌లో ఏ జట్టు గెలిస్తే ఆ జట్టు ముందుకు వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే, ఈ మ్యాచ్‌పై వర్షం ముప్పు పొంచి ఉంది.

1 / 5
IPL 2024 Playoffs: ప్రస్తుతం IPL 2024లో, అభిమానుల కళ్ళు RCB వర్సెస్ CSK మధ్య జరగబోయే మ్యాచ్‌పై మాత్రమే ఉన్నాయి. ఈ మ్యాచ్ కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇరు జట్ల మధ్య జరిగే ఈ మ్యాచ్ క్వార్టర్ ఫైనల్ లాగా ఉండడమే ఇందుకు కారణం. అంటే, ఈ మ్యాచ్‌లో ఏ జట్టు గెలిస్తే ఆ జట్టు ముందుకు వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే, ఈ మ్యాచ్‌పై వర్షం ముప్పు పొంచి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో వర్షం కారణంగా మ్యాచ్ రద్దైతే ప్లేఆఫ్‌కు ఏ జట్టు అర్హత సాధిస్తుందన్నది అభిమానుల మదిలో మెదులుతున్న ప్రశ్న.

2 / 5
లీగ్ దశలో చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లకు ఇప్పుడు ఒకే ఒక మ్యాచ్ మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ రెండు జట్లు మే 18న తలపడనున్నాయి. ఆ మ్యాచ్ ఒక కోణంలో RCBకి నాకౌట్ మ్యాచ్ అవుతుంది. ఆ మ్యాచ్‌లో ఆ జట్టు సీఎస్‌కేను ఓడించడమే కాకుండా విక్టరీ మార్జిన్‌ను ఎక్కువగా ఉంచుకోవాల్సి ఉంటుంది.

3 / 5
ముందుగా బ్యాటింగ్ చేసిన జట్టు కనీసం 18 పరుగుల తేడాతో గెలవాలి. ఆ తర్వాత బ్యాటింగ్ చేస్తే 18.1 ఓవర్లలో 180 పరుగుల లక్ష్యాన్ని ఛేదించాల్సి ఉంటుంది. ఇదే జరిగితే, RCB నెట్ రన్ రేట్ CSK కంటే మెరుగ్గా ఉంటుంది. అప్పుడు బెంగళూరు జట్టు ప్లేఆఫ్‌లకు వెళ్తుంది. ఇటువంటి పరిస్థితిలో CSK ఔట్ అవుతుంది.

4 / 5
అయితే, వాతావరణ శాఖ అంచనా ప్రకారం, RCB వర్సెస్ CSK మ్యాచ్ సమయంలో బెంగళూరులో వర్షం పడే అవకాశం ఉంది. ఒకవేళ వర్షం కారణంగా మ్యాచ్‌ రద్దైతే సీఎస్‌కే ప్లేఆఫ్‌కు అర్హత సాధిస్తుంది. చెన్నై జట్టుకు 14 పాయింట్లు ఉన్నాయి. వర్షంతో మ్యాచ్ రద్దయితే, ఒక పాయింట్ వస్తే 15 పాయింట్లు ఉంటాయి. ఆర్‌సీబీకి 12 పాయింట్లు ఉన్నాయి. ఒక పాయింట్ వస్తే 13 పాయింట్లు మాత్రమే ఉంటాయి.

5 / 5
వర్షం కారణంగా ఈ మ్యాచ్ రద్దు కాకూడదని RCB అభిమానులు భావిస్తున్నారు. ఎందుకంటే, ఇదే జరిగితే ఆర్సీబీ ఆశలు పూర్తిగా గల్లంతు కానున్నాయి. ఎందుకంటే ఈసారి 13 పాయింట్లతో ప్లేఆఫ్స్‌లో చోటు దక్కించుకోదు. సన్‌రైజర్స్ హైదరాబాద్, సీఎస్‌కే రెండూ 14 పాయింట్లతో ఉన్నాయి. ఢిల్లీ క్యాపిటల్స్‌కు కూడా 14 పాయింట్లు ఉన్నాయి. కేకేఆర్, రాజస్థాన్ జట్లు ఇప్పటికే అర్హత సాధించాయి.