
ఐపీఎల్ (IPL 2024) సీజన్ 17లో 54వ మ్యాచ్‌లో సునీల్ నరైన్ అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శనతో సిక్సర్ల జాబితాలో అగ్రస్థానంలో నిలిచాడు. ఎకానా స్టేడియంలో లక్నో సూపర్‌జెయింట్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో KKR తర;iన నరైన్ ఓపెనర్‌గా బరిలోకి దిగాడు.

తొలి ఓవర్ నుంచే తుఫాన్ బ్యాటింగ్ కనబర్చిన నరైన్.. సిక్స్ ఫోర్ల వర్షం కురిపించాడు. దీంతో అతను కేవలం 39 బంతుల్లో 7 భారీ సిక్సర్లు, 6 ఫోర్లతో 81 పరుగులు చేశాడు.

ఈ 7 సిక్సర్లతో ఈ ఐపీఎల్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాట్స్‌మెన్ జాబితాలో సునీల్ నరైన్ అగ్రస్థానంలో నిలిచాడు. దీనికి ముందు సన్ రైజర్స్ హైదరాబాద్ స్ట్రైకర్ హెన్రిక్ క్లాసెన్ మొదటి స్థానంలో ఉన్నాడు.

సన్‌రైజర్స్ హైదరాబాద్ తరపున 10 మ్యాచ్‌ల్లో మిడిల్ ఆర్డర్‌లో బ్యాటింగ్ చేసిన హెన్రిక్ క్లాసెన్ ఇప్పటివరకు మొత్తం 31 సిక్సర్లు బాదాడు. ఇప్పుడు ఈ సిక్సర్ల సంఖ్యను దాటడంలో నరైన్ సక్సెస్ అయ్యాడు.

కేకేఆర్‌లో ఓపెనర్‌గా బరిలోకి దిగిన సునీల్ నరైన్ 11 ఇన్నింగ్స్‌ల్లో 32 సిక్సర్లు బాదాడు. దీంతో ఈ ఐపీఎల్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. సిక్సర్లతో పాటు నరైన్ బ్యాట్‌తో 46 ఫోర్లు బాదాడు. దీంతో మొత్తం 461 పరుగులు చేసిన సునీల్ నరైన్ ఐపీఎల్ 2024 రన్ లీడర్ జాబితాలో మూడో స్థానానికి చేరుకున్నాడు.