IPL 2024: ఐపీఎల్ చరిత్రలో కండల వీరుడి సరికొత్త రికార్డ్.. గంభీర్ చేరికతో కేకేఆర్ ప్లేయర్ భీభత్సం..

|

Mar 30, 2024 | 10:06 AM

IPL 2024: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 (IPL 2024)లో కోల్‌కతా నైట్ రైడర్స్ తమ రెండవ మ్యాచ్‌లో విజయం సాధించింది. తొలి మ్యాచ్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్‌పై గెలిచిన కేకేఆర్ ఈసారి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చేతిలో ఓడిపోయింది. ఈ మ్యాచ్‌లో ఆండ్రీ రస్సెల్ అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శన చేసి ప్రత్యేక రికార్డును లిఖించాడు.

1 / 5
బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఐపీఎల్ (IPL 2024) 10వ మ్యాచ్ ద్వారా కేకేఆర్ ప్లేయర్ ఆండ్రీ రస్సెల్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. అది కూడా తన ఆల్ రౌండర్ ఆటతోనే కావడం విశేషం. ఆర్సీబీతో జరిగిన ఈ మ్యాచ్‌లో 4 ఓవర్లు వేసిన రస్సెల్ 29 పరుగులు ఇచ్చి 2 వికెట్లు పడగొట్టాడు.

2 / 5
ఈ రెండు వికెట్లతో ఆండ్రీ రస్సెల్ ఐపీఎల్‌లో 100 వికెట్లు సాధించాడు. దీంతో ఐపీఎల్ చరిత్రలో 2000 పరుగులు + 100 వికెట్లు సాధించిన తొలి విదేశీయుడిగా రస్సెల్ నిలిచాడు. ఈ ఘనత సాధించిన 2వ క్రికెటర్‌గా కూడా నిలిచాడు.

3 / 5
ఇంతకు ముందు ఈ రికార్డు రవీంద్ర జడేజా పేరిట ఉండేది. సీఎస్‌కే తరఫున ఆడుతున్న జడ్డూ ఐపీఎల్‌లో 2724 పరుగులు చేశాడు. 152 వికెట్లు తీసి ప్రత్యేక రికార్డు కూడా సృష్టించాడు.

4 / 5
ఇప్పుడు ఆండ్రీ రస్సెల్ కూడా ఈ ప్రత్యేక రికార్డు జాబితాలో చేరాడు, అతను IPL లో 2326 పరుగులు, 100 వికెట్లు సాధించాడు. దీని ద్వారా ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో 2000 పరుగులు + 100 వికెట్లు సాధించిన తొలి విదేశీ ఆటగాడిగా నిలిచాడు.

5 / 5
ఈ మ్యాచ్‌లో ఆండ్రీ రస్సెల్ అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శించి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టును 182 పరుగులకు నియంత్రించగలిగాడు. 183 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు 16.5 ఓవర్లలో 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది.