IPL 2024: పవర్ ప్లేలో బంతి పగిలిపోవాల్సిందే.. భారీ రికార్డ్‌లో ఇద్దరే ఇద్దరు.. ఎవరు, అసలేంటి ఆ రికార్డ్?

|

Mar 30, 2024 | 11:55 AM

Most Sixes In Powerplay: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) పవర్‌ప్లే ఓవర్లలో కేవలం ఇద్దరు బ్యాట్స్‌మెన్ మాత్రమే వందకు పైగా సిక్సర్లు కొట్టారు. ఈ జాబితాలో ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ ప్లేయర్ డేవిడ్ వార్నర్ రెండో స్థానంలో ఉన్నాడు. ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్ ద్వారా వార్నర్ ఈ ప్రత్యేక ఫీట్ సాధించాడు. ఈ లిస్టులో అగ్రస్థానంలో ఎవరున్నారో ఇప్పుడు తెలుసుకుందాం..

1 / 5
David Warner Record: జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో జరిగిన ఐపీఎల్ (IPL 2024) 9వ మ్యాచ్‌లో డేవిడ్ వార్నర్ అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శన చేశాడు. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో, ఢిల్లీ క్యాపిటల్స్ తరపున బ్యాటింగ్ చేసిన వార్నర్ 34 బంతుల్లో 3 సిక్సర్లు, 5 ఫోర్లతో 49 పరుగులు చేశాడు.

2 / 5
డేవిడ్ వార్నర్ 3 సిక్సర్లతో సరికొత్త మైలురాయిని అధిగమించాడు. అది కూడా పవర్‌ప్లేలో సిక్సర్ కొట్టడం విశేషం. అంటే, ఐపీఎల్ చరిత్రలో పవర్ ప్లేలో అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాట్స్‌మెన్‌ల జాబితాలో వార్నర్ 2వ స్థానంలో నిలిచాడు.

3 / 5
ఈ జాబితాలో యూనివర్స్ బాస్ ఫేమ్ క్రిస్ గేల్ అగ్రస్థానంలో ఉన్నాడు. ఐపీఎల్‌లో 142 మ్యాచ్‌లు ఆడిన గేల్ పవర్‌ప్లేలో మొత్తం 143 సిక్సర్లు బాదాడు. దీంతో ఐపీఎల్‌లో తొలి 6 ఓవర్లలో అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు.

4 / 5
ఇప్పుడు, రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 3 సిక్సర్లతో డేవిడ్ వార్నర్ IPL పవర్‌ప్లేలో 100 కంటే ఎక్కువ సిక్సర్లు కొట్టిన 2వ బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. 178 ఐపీఎల్ ఇన్నింగ్స్‌లు ఆడిన వార్నర్ పవర్‌ప్లేలో ఇప్పటివరకు 101 సిక్సర్లు బాదాడు.

5 / 5
దీంతో ఐపీఎల్ చరిత్రలో క్రిస్ గేల్ తర్వాత పవర్‌ప్లేలో 100 సిక్సర్లు బాదిన 2వ బ్యాట్స్‌మెన్‌గా డేవిడ్ వార్నర్ నిలిచాడు. ఐపీఎల్‌లో అత్యధిక హాఫ్ సెంచరీలు సాధించిన ఆటగాడిగా కూడా వార్నర్ రికార్డు సృష్టించాడు. డేవిడ్ వార్నర్ ఇప్పటి వరకు 61 అర్ధశతకాలు సాధించగా, ఈ రికార్డును ఎవరు బ్రేక్ చేస్తారో చూడాలి.