IPL 2023-RCB: కొత్త జెర్సీని ఆవిష్కరించిన ఆర్‌సీబీ.. నెట్టింట వైరల్ అవుతున్న కింగ్ కోహ్లీ ఫోటోలు..

|

Mar 26, 2023 | 5:18 PM

IPL 2023-RCB : ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ 16 కోసం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తమ కొత్త జెర్సీని ఆవిష్కరించింది. ఆర్‌సీబీ అన్‌బాక్స్ ప్రోగ్రామ్ ద్వారా విడుదల చేయాలనుకున్న జెర్సీ ఫోటోలు ఇప్పుడు లీక్ కాగా.. అవి కాస్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

1 / 6

2 / 6
గతేడాది మాదిరిగానే ఆర్‌సీబీ ఈసారి కూడా ఎరుపు, నలుపు కాంబో జెర్సీలో కనిపించనుంది. మహిళల ప్రీమియర్ లీగ్‌లో RCB మహిళల జట్టు ధరించిన జెర్సీ డిజైనే మెన్స్ టీమ్ జెర్సీలో కూడా ఉంది. అయితే ఇక్కడ జట్టు స్పాన్సర్‌షిప్‌లో మాత్రమే మార్పు వచ్చింది.

3 / 6
 అంటే మహిళల జట్టు జెర్సీకి కుడివైపున టాటా క్యాపిటల్స్ అని, ఇంకా సెంటర్‌లో కజారియా అని రాసి ఉంటుంది. కానీ పురుషుల జెర్సీలోకి వచ్చేసరికి టాటా క్యాపిటల్స్ స్థానంలో హ్యాపీలా కంపెనీ.. అలాగే కజారియా స్థానంలో ఖతర్ ఎయిర్‌వేస్ అని ఉంది. ఇక ఇవి కాక చెప్పుకోదగ్గ మార్పు ఏమీ లేదు.

4 / 6
గత సీజన్‌ ఆర్‌సీబీ జెర్సీతో పోలిస్తే కొత్త జెర్సీలో స్పాన్సర్ల పేర్లు మినహా ఎలాంటి మార్పు లేదు. పోయినసారి ఫ్రంట్‌లో ఇచ్చిన ముత్తూట్ ఫిన్‌కార్ప్‌కు బదులుగా, ఈసారి ఖతార్ ఎయిర్‌వేస్ ప్రకటన కనిపించింది. మిగిలిన డిజైన్, రంగులు గతేడాది ఉన్న డిజైన్‌లోనే కొనసాగించబడ్డాయి.

5 / 6
ఇక గత సీజన్‌లో ప్లే ఆఫ్‌లోకి ప్రవేశించిన ఆర్‌సీబీ జట్టు ఈసారి ముంబై ఇండియన్స్‌తో తొలి మ్యాచ్ ఆడనుంది. ఏప్రిల్ 2న చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ తమ ఐపీఎల్ ప్రచారాన్ని ప్రారంభించడం విశేషం.

6 / 6
RCB స్క్వాడ్: ఫాఫ్ డుప్లెసిస్ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, దినేష్ కార్తీక్, అనుజ్ రావత్, ఫిన్ అలెన్, జోష్ హేజిల్‌వుడ్, మహ్మద్ సిరాజ్, కర్ణ్ శర్మ, సిద్ధార్థ్ కౌల్, రీస్ టాప్లీ, హిమాన్షు శర్మ, రాజన్, అవినాష్ సింగ్ కుమార్, గ్లెన్ మాక్స్‌వెల్, వానిందు హస్సరంగా , మహిపాల్ లోమ్రార్, షాబాజ్ అహ్మద్, హర్షల్ పటేల్, ఆకాష్ దీప్, డేవిడ్ విల్లీ, సుయాష్ ప్రభుదేశాయ్, మనోజ్ భాండాగే, సోను యాదవ్, మైఖేల్ బ్రేస్‌వెల్, రజత్ పాటిదార్(గాయ పడ్డాడు).