- Telugu News Photo Gallery Cricket photos IPL 2023 Mini Auction: ms dhoni to irfan pathan these 3 indian players got highest bid in 2008 ipl auction check what are they doing now
IPL Auction: ఐపీఎల్ 2008 వేలంలో అత్యంత ఖరీదైన భారత ఆటగాళ్లు.. నేడు ఏం చేస్తున్నారో తెలుసా?
Team India Players: అదే సమయంలో IPL మొదటి సీజన్‌లో అంటే 2008లో అత్యంత ఖరీదైన కొంతమంది భారతీయ ఆటగాళ్లు ఉన్నారు. ఈ ఆటగాళ్లు ఆ సమయంలో అంతర్జాతీయ వేదికలపై చాలా పెద్ద ఆటగాళ్లు. అందుకే చాలా ఖరీదుగా మారారు.
Updated on: Dec 24, 2022 | 9:21 AM

Team India Players: 15 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో ఇప్పటివరకు ఎందరో దిగ్గజ ఆటగాళ్లు ఆడారు. వీరిలో కొందరు ఆటగాళ్లు అద్భుతంగా ఆడారు. తమ జట్టును ఛాంపియన్‌లుగా చేయడంలో కీలక పాత్ర పోషించారు. అయితే, వారి ప్రదర్శన కాలక్రమేణా క్షీణించింది. ఆ తర్వాత IPL నుంచి క్రమంగా బయటికి వచ్చేశారు.

అదే సమయంలో IPL మొదటి సీజన్‌లో అంటే 2008లో అత్యంత ఖరీదైన కొంతమంది భారతీయ ఆటగాళ్లు ఉన్నారు. ఈ ఆటగాళ్లు ఆ సమయంలో అంతర్జాతీయ వేదికలపై చాలా పెద్ద ఆటగాళ్లు. అందుకే చాలా ఖరీదుగా మారారు. ఐపీఎల్ 2008లో అత్యంత ఖరీదైన ముగ్గురు భారత ఆటగాళ్లు ఉన్నారు. ఇప్పుడు వారు ఏం చేస్తున్నారో ఓసారి చూద్దాం..

ఇర్ఫాన్ పఠాన్ 2008లో భారత జట్టులో చాలా పెద్ద ఆల్ రౌండర్ ఆటగాడు. 2008 IPL వేలానికి ముందు, ఇర్ఫాన్ పఠాన్ భారత జట్టుతో T20 ప్రపంచ కప్ టైటిల్‌ను గెలుచుకున్నాడు. మొదటి ఫైనల్ మ్యాచ్‌లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా కూడా ఎంపికయ్యాడు. ఈ కారణంగా, పంజాబ్ కింగ్స్ జట్టు అతని కోసం చాలా ఖరీదైన బిడ్ చేసింది.

అతను ఆ సీజన్‌లో 14 మ్యాచ్‌లలో 21.20 స్ట్రైక్ రేట్‌తో 15 వికెట్లు పడగొట్టాడు. 112.93 స్ట్రైక్ రేట్‌తో 131 పరుగులు చేశాడు. ఆ తర్వాత అతను ఢిల్లీ డేర్‌డెవిల్స్, చెన్నై సూపర్ కింగ్స్ తరపున కూడా IPL ఆడాడు. ఇక 2017 సీజన్‌లో గుజరాత్ లయన్స్ తరపున ఆడడంతో అతని IPL కెరీర్ ముగిసింది. ఇర్ఫాన్ పఠాన్ తన IPL కెరీర్‌లో మొత్తం 103 మ్యాచ్‌లు ఆడి 80 వికెట్లతో 1139 పరుగులు చేశాడు. ప్రస్తుతం వ్యాఖ్యాతగా బిజీగా ఉన్నాడు.

భారత జట్టు ఫాస్ట్ బౌలర్ ఇషాంత్ శర్మను కోల్‌కతా నైట్ రైడర్స్ 2008 IPL సీజన్‌లో చాలా ఖరీదైన బిడ్‌తో కొనుగోలు చేసింది. ఆ సీజన్‌లో ఇషాంత్ 13 మ్యాచ్‌ల్లో 8 వికెట్లు మాత్రమే తీశాడు. ఆ తర్వాత 2013లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరపున ఆడుతూ 15 వికెట్లు పడగొట్టాడు. అదే సమయంలో 2018 సీజన్‌లో అమ్ముడుపోలేదు. ఆ తర్వాత, ఇన్‌షాంత్ శర్మను 2023 IPLలో రూ. 1.1 కోట్లకు ఢిల్లీ క్యాపిటల్స్ కొనుగోలు చేసింది.

2007లో భారత్‌కు తొలి టీ20 ప్రపంచకప్‌ను అందించిన భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ, 2008 ఐపీఎల్‌లో అత్యధికంగా అమ్ముడైన ఆటగాడిగా నిలిచాడు. చెన్నై సూపర్ కింగ్స్ అతడిని రూ.9.5 కోట్లకు కొనుగోలు చేసింది. తొలి సీజన్‌లో ధోనీ 16 మ్యాచ్‌ల్లో 133.54 స్ట్రైక్ రేట్‌తో మొత్తం 414 పరుగులు చేశాడు.

2011లో భారత్‌కు ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్‌ను అందించిన ధోని, తన కెప్టెన్సీలో చెన్నై సూపర్ కింగ్స్‌ను 2010, 2011, 2018, 2021లో నాలుగుసార్లు ఐపీఎల్ ఛాంపియన్‌గా మార్చాడు. ఎంఎస్ ధోని అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయ్యి ప్రస్తుతం ఐపీఎల్‌లో ఆడుతున్నాడు.





























