IPL 2023: ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత చెత్త రికార్డ్ నమోదు చేసిన దినేష్ కార్తీక్.. ఏకంగా 4 డకౌట్స్‌..

|

May 22, 2023 | 2:55 PM

IPL 2023: ఐపీఎల్ చరిత్రలో దినేష్ కార్తిక్ అత్యంత చెత్త రికార్డ్ క్రియేట్ చేశాడు. ఈ సీజన్‌లో ఏకంగా 4వ సారి వరుసగా డకౌట్ అయ్యాడు. ఐపీఎల్‌లో అత్యధికంగా డకౌట్ అయిన ప్లేయర్‌గా డీకే నిలిచాడు. అయితే, ఐపీఎల్ మొత్తంలో ఎక్కువ డకౌట్ అయిన టాప్-5 ప్లేయర్స్ లిస్ట్ ఇప్పుడు చూద్దాం..

1 / 8
IPL 2023 RCB vs GT: బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో దినేష్ కార్తీక్ డక్ అవుట్ కావడం ద్వారా చెత్త రికార్డ్ నమోదు చేశాడు.

2 / 8
ఈ మ్యాచ్‌లో 5వ స్థానంలో వచ్చిన దినేష్ కార్తీక్ తొలి బంతికే వికెట్‌ను సమర్పించుకున్నాడు. ఈ గోల్డెన్ డక్‌తో ఐపీఎల్ చరిత్రలోనే అత్యధికసార్లు డకౌట్ అయిన ఆటగాడిగా డీకే పేరు తెచ్చుకున్నాడు.

3 / 8
ఆశ్చర్యకరంగా ఈ ఐపీఎల్‌లో దినేష్ కార్తీక్‌కి ఇది 4వ డకౌట్. IPLలో ఎక్కువసార్లు డకౌట్ అయిన టాప్ 5 క్రికెటర్ల లిస్ట్ ఇప్పుడు చూద్దాం.

4 / 8
1. దినేష్ కార్తీక్: 221 IPL ఇన్నింగ్స్‌లు ఆడిన దినేష్ కార్తీక్ మొత్తం 17 సార్లు డకౌట్ అయ్యాడు. దీంతో ఐపీఎల్‌లో దీకే టాప్‌లో నిలిచాడు.

5 / 8
2. రోహిత్ శర్మ: ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ 236 ఇన్నింగ్స్‌లలో మొత్తం 16 సార్లు డకౌట్ అయ్యాడు.

6 / 8
3. సునీల్ నరైన్: కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు ఆటగాడైన సునీల్ నరైన్ 96 ఇన్నింగ్స్‌లలో 15 సార్లు డకౌట్ అయ్యాడు.

7 / 8
4. మన్‌దీప్ సింగ్: KKR ఆటగాడు మన్‌దీప్ సింగ్ 98 ఇన్నింగ్స్‌లలో ఎటువంటి పరుగులు చేయకుండా మొత్తం 15 సార్లు డకౌట్ అయ్యాడు.

8 / 8
5. అంబటి రాయుడు: CSK జట్టు బ్యాట్స్‌మెన్ అంబటి రాయుడు 185 ఇన్నింగ్స్‌లలో మొత్తం 14 సార్లు డక్ అవుట్ అయ్యాడు.